Anchor Rashmi : ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే గ్లామర్ బ్యూటీగా యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఆ తర్వాత జబర్దస్త్ లో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అక్కడ కమెడియన్ సుడిగాలి సుదీర్ తో లవ్ ట్రాక్ నడిపిన ఈమె అది కేవలం స్మాల్ స్క్రీన్ వరకు మాత్రమే పరిమితం అంటూ తేల్చి చెప్పేశారు. అయినా ఇప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే జనాలు కూడా చాలామంది ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రష్మీ తన లవ్ లో ఫెయిల్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అదేంటో ఇప్పుడు పూర్తిగా చదివి తెలుసుకుందాం. ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి అసలు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రవిబాబు విచ్చేయగా రవిబాబు తో పాటు బ్రహ్మాజీ కూడా సందడి చేశారు .ఇంద్రజను అమ్మ అమ్మ అంటూ తెగ ఆటపట్టించారు. ఇక లాస్ట్ లో ఒక పాప్ కార్న్ డబ్బా పెట్టి అందులో రాయి వేసి తెగ సందడి చేశారు.
ఇక అందరిలాగే రష్మీ కూడా ఒక బెట్టు వేసుకుంది. అది కూడా తన ప్రేమ విషయంలో. ఆ డబ్బాలో తాను విసిరిన రాయి పడితే తన లైఫ్ లో తన లవ్ సక్సెస్ అయినట్లు లేకపోతే ఫెయిల్యూర్ అయినట్టు చెప్పింది. అందరూ కూడా ఆమె లవ్ సక్సెస్ అవ్వాలని ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఆమె విసిరిన రాయి ఆ డబ్బాలో పడలేదు దీంతో రష్మీ కూడా ఆశ్చర్యపోయింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు ఇక ఈ ప్రోమో కూడా ఇక్కడితో ఎండ్ అయింది. ఇక పూర్తి విషయాలు తెలియాలి అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ షో ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.