Anchor Pradeep : ఆ అమ్మాయితో ఆ సంబంధం లేదు..క్లారిటి ఇచ్చిన యాంకర్..

- Advertisement -

Anchor Pradeep : బుల్లితెర పై మేల్ యాంకర్స్ లలో ఎక్కువగా వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు..జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు షో ద్వారా ఆర్జె ప్రదీప్ కాస్త వీజె ప్రదీప్ అయ్యాడు.. ఒక్కో షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న ఇతని సోషల్ మీడియాలో కూడా తెగ వార్తలు వస్తుంటాయి..ఇటీవల ఓ వార్త షికారు చేస్తుంది.. త్వరలోనే డిజైనర్ నవ్య తో పెళ్ళి అంటూ తెగ ట్రోల్ అయ్యింది..ఆ విషయం పై ప్రదీప్ స్పందించారు.. ఆమె ఎవరూ కూడా నాకు తెలియదు అంటూ క్లారిటి ఇచ్చాడు..

Anchor Pradeep
Anchor Pradeep

ప్రదీప్ ఇప్పటివరకు చేసిన ఎక్స్ ప్రెస్ రాజా, ఢీ జోడి వంటి షోలతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక అమ్మాయిల్లో ఈయనకి ఓ స్టార్ హీరో కి ఉన్న రేంజ్ లో ఫ్యాన్స్ ఉంటారు. ఇక అలాంటి ప్రదీప్ ఎన్నో ఈవెంట్లలో ,ఆడియో ఫంక్షన్లలో,అవార్డ్స్ ఫంక్షన్లలో, ప్రోగ్రాం లలో అలాగే వెండితెర పై కూడా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేస్తూ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

అంతేకాదు..30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా నిర్మాతలకు కలెక్షన్ల వర్షం తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో ఉండే పాటలు మాత్రం అప్పట్లో యూత్ ని చాలా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఆ మధ్యకాలంలో స్వయంవరం అనే ఒక షో పెట్టి ప్రదీప్ పెళ్లి అని చెప్పారు.అయితే నిజంగానే అందులో గెలిచిన అమ్మాయిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటారని అందరూ భావించారు.కానీ అది కేవలం ఎంటర్టైన్మెంట్ వరకే అని తెలియగానే రేటింగ్ కోసం ఇంతలా దిగజారుతారా అంటూ జనాలు దుమ్మెత్తి పోశారు..

- Advertisement -
marrige
marrige

ఇక ఇన్ని సంవత్సరాలైనా పెళ్లి చేసుకోకపోవడంతో ప్రదీప్ ని చాలామంది ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఇక తాజాగా ప్రదీప్ ఓ ఫ్యాషన్ డిజైనర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆమె పేరుతో సహా చెప్పారు. నవ్య అనే ఫ్యాషన్ డిజైనర్ ని ప్రదీప్ పెళ్లి చేసుకుంటున్నాడు సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అంటూ వార్తలు వినిపించాయి. తాజాగా పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్ అందరికీ క్లారిటీ ఇచ్చారు. ప్రదీప్ మాట్లాడుతూ.. నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదు..ఆ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు అంటూ క్లారిటి ఇచ్చారు..

Pradeep
Pradeep

పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో తనకు లేదని త్వరలోనే ఓ మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాను అంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు 2023లో నా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాను అంటూ ప్రదీప్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రదీప్ మాటలు విన్న చాలామంది నెటిజన్స్ ఇంకెన్ని రోజులు పెళ్లి వాయిదా వేసుకుంటూ వస్తావ్..అసలు నీకు పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం ఉందా..లేదా అని కామెంట్లు చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here