Anchor Pradeep బుల్లితెరపై ఫెమస్ మేల్ యాంకర్స్ అంటే ప్రదీప్ పేరే వినిపిస్తుంది..ప్రదీప్ హోస్టు చేసిన ఏ షో అయిన సూపర్ హిట్ అవ్వాల్సిందే.. అంతలా పాపులర్ అయ్యాడు ప్రదీప్..సుదీర్ఘకాలంగా తనదైన ముద్ర వేసుకున్న ఈయన సినిమాలలో కూడా తెగ సందడి చేస్తున్నారు. ఇటీవల 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ప్రదీప్ ఎక్కువగా హీరోలకు స్నేహితుడి క్యారెక్టర్ లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రదీప్ పెళ్లిపై వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి..ఎన్నో ఏళ్ల నుంచి యాంకర్ ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి..

ఇక తాజాగా అతని పెళ్లి ఫిక్స్ అయిందట. ఈ విషయాన్ని లెజెండ్రీ సింగర్ ఎస్పీ శైలజ వెల్లడించారు. తాజాగా సరిగమప షోలో జడ్జిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. నాకు చాలా ఆనందకరమైన విషయం ఏమిటంటే.. యాంకర్ ప్రదీప్ కి పెళ్లి కుదిరింది అని చెప్పుకొచ్చారు. అభిమానులంతా తెగ సంబర పరిపోతున్నారు.. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..ఇప్పటికే యాంకర్ గా చేతినిండా షోలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న సరిగమప చాంపియన్షిప్ అనే సింగింగ్ షోలో అలరిస్తున్నాడు.
ప్రతి ఆదివారం ప్రసారమవుతున్న ఈ షోలో సరిగమప సీజన్లోని కొందరు టాప్ సింగర్ లను నడిపిస్తున్నారు. ఇందులో ప్రదీప్ నెక్స్ట్ లెవెల్ లో ప్రేక్షకులను అలరిస్తున్నారని చెప్పవచ్చు..షోలో వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్లో ఎస్పీ శైలజ..ప్రదీప్ పెళ్లి సెట్ అయినట్లు చెప్పారు. అంతేకాదు ఫ్రీ వెడ్డింగ్ ప్లాన్స్ లో భాగంగా మ్యూజిక్ ఈవెంట్ ని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ప్రదీప్ నా పెళ్లి గురించి నాకు కూడా తెలియదు మేడం.. అమ్మాయి ఎవరో నాకు కూడా చెప్పండి అంటూ అనడంతో అది ఎదో డ్రామానా అని జనాలు ఫీల్ అవుతున్నారు.. నిజంగానే పెళ్లి ఫిక్స్ అయ్యిందా లేదా అనేది ఆ ఎపిసోడ్ లోనే చూడాలి.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది..