Anchor Lasya గురించి అందరికి తెలుసు.. తన యాంకరింగ్ తో యువతను బాగా ఆకట్టుకుంటుంది.. అయితే ప్రస్తుతం నిండు గర్భిణీగా ఇబ్బందులను పడుతుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఆడపిల్లలు తల్లయ్యాక పడే బాధలను కళ్ళకు కట్టినట్లు చూపించింది. ప్రస్తుతం ఇది కామెంట్లతో ట్రెండ్ అవుతుంది.. ఆమె మొదటిసారి మగబిడ్డకు జన్మనించింది.. ఇక ఇప్పుడు యాంకర్ లాస్య రెండోసారి తల్లయ్యారు. నిండు గర్భిణిగా ఉన్న లాస్యకు త్వరలో ప్రసవం కానుంది.

ప్రెగ్నెంట్ పీరియడ్ ఆడవాళ్ళకు మరో జన్మతో సమానం. చాలా జాగ్రత్తగా ఉండాలి. బిడ్డ కారణంగా పెరిగిన పొట్ట ఏ పనీ సులభంగా చేసుకోనివ్వదు. కూర్చోవడం, పడుకోవడం, నడవడం కూడా కష్టమే. గర్భవతిగా తన ఇబ్బందులు తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేసింది. అలాగే భర్త మంజునాథ్ ఆమె పక్కనే ఉంటూ ఎలా జాగ్రత్తలు చెబుతున్నారో ఆ వీడియో లో చూడొచ్చు.. తన భర్త అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారని లాస్య ఆ వీడియో ద్వారా చూపించింది. అలాంటి భర్త దొరకడం తన అదృష్టం అని చెప్పకనే చెప్పింది..మంజునాథ్ ని లాస్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి జున్ను అనే ఓ ఐదేళ్ల బాబు ఉన్నాడు. రెండోసారి లాస్య తల్లయ్యారు.
తన ప్రేమను పెద్దలు అంగీకరించలేదని, చాలా కాలం తర్వాత తమను దగ్గర తీసుకున్నారని లాస్య బిగ్ బాస్ హౌస్లో తెలియజేశారు. సీజన్ 4లో పాల్గొన్న లాస్య కొద్ది వారాలకే ఎలిమినేట్ అయ్యారు.. అద్భుతమైన వంటలు చేస్తూ అందరికి మనసుదోచ్చుకుంది లాస్య..పెళ్లయ్యాక యాంకరింగ్ మానేశారు.. టాప్ యాంకర్స్ ఒకరిగా లాస్య పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం లాస్య సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. అలాగే తన పేరిట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మంచి వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..