Anasuya : జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకొని నేడు టాలీవుడ్ లో గొప్ప స్థాయికి చేరుకున్న అతి తక్కువ మందిలో ఒకరు అనసూయ. జబర్దస్త్ షో కి ముందు ఈమె పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కానీ పెద్దగా గుర్తింపేమి రాలేదు. కానీ ఎప్పుడైతే జబర్దస్త్ షో కి యాంకరింగ్ చెయ్యడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఈమె జాతకమే మారిపోయింది.
బుల్లితెర మీద ఎన్నో ఎంటర్టైన్మెంట్ షోస్ కి యాంకరింగ్ చేస్తూ వచ్చిన ఆమె, ఆ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు సంపాదించింది. లేడీ విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో వైవిద్యభరితమైన సినిమాలను చేసిన అనసూయ, ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించింది. ఇప్పుడు ‘పుష్ప ది రూల్’ సినిమాతో పాటుగా, పలు పెద్ద సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ గా గడుపుతుంది యాంకర్ అనసూయ.
ఇది ఇలా ఉండగా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అనసూయ అభిమానులతో ఎల్లప్పుడూ టచ్ లో ఉంటున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నో సందర్భాలలో ఆమె కాంట్రవర్సీ పోస్టులు పెడుతూ నెటిజెన్స్ చేత తిట్లు కూడా తింటూ ఉంటుంది. అంతే కాకుండా తనకి సంబంధించి హాట్ ఫోటోలు మరియు వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ ఎల్లప్పుడూ ట్రెండింగ్ లో ఉంటుంది ఈమె. రీసెంట్ గా ఈమె తన కొడుకులతో ఏర్పడిన కొన్ని సమస్యల గురించి సోషల్ మీడియా లో చెప్పుకొచ్చింది.
ఆమె మాట్లాడుతూ ‘నా కొడుకులకు జోబులో డబ్బులు వదిలేయడం అలవాటు అయిపోయింది. ఒక్కోసారి నేను చూసుకోకుండా బట్టలను వాషింగ్ మెషిన్ లో వేసినప్పుడు, ఆ డబ్బుల ఉన్న కారణంగా వాషింగ్ మెషిన్ అనేకసార్లు చెడిపోయింది. ఎన్నో సార్లు సర్వీసు కి ఇచ్చి ఎంతో డబ్బులను నష్టపోవాల్సి వచ్చింది..మీకు కూడా మీ పిల్లల వల్ల ఇలాంటి సమస్యలు ఎదురు అయ్యాయా?’ అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.