Anchor Anasuya : టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొద్దిరోజుల క్రితమే థైస్ షో చేస్తూ అనసూయ ఇచ్చిన పోజులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలతో అనసూయ ఒకింత ట్రోలింగ్ కు కూడా గురైంది. ఇప్పుడు మరోసారి అనసూయ తన అందాలతో నెట్టింట ఆటం బాంబ్ పేల్చింది.

అయితే ఈసారి అనసూయ కాస్త క్యూట్ గా ఇంకాస్త నాటీగా పోజులిచ్చింది. ఈసారి కూడా షార్ట్ అండ్ టీ షర్ట్ వేసుకుని క్యాజువల్ లుక్ లోనే టెంపరేచర్ రేజ్ చేసింది. థైస్ షో చేస్తూ మరోసారి నెట్టింట సెగలు పుట్టించింది. అయితే ఈసారి అనసూయ కాస్త వెరైటీ పోజులు ట్రై చేసింది. ఈ పోజులు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ ఫొటోలు చూసి కొందరేమో అనసూయ ఈ ఏజ్ లో కూడా యంగ్ గా కనిపిస్తోందని అంటున్నారు. మరికొందరేమో.. ఇద్దరు పిల్లలకు తల్లైనా చాలా ఫిట్ గా ఉందంటూ పొగడ్తలు కురిపించారు. హీరోయిన్లకు పోటీనిస్తూ అనసూయ అందం ఉందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరేమో అనసూయ లేటెస్ట్ ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారు. పిక్కలు చూపిస్తూ కాళ్లు ముడుచుకొని కూర్చున్న అనసూయను ఏమండి ఏమన్నాఅంటే అన్నారంటారుగాని రంగమార్తండకు ఈ యోగా గెటప్ కు సంబంధముందా అండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో ఒంటిపై పుట్టుమచ్చలు ఇంత క్లియర్ గా చూపిస్తే ఎలాగంటూ అసభ్యకరంగా కామెంట్ చేశారు.

ఇటీవలే కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రంగమార్తాండ సినిమాలో అనసూయ మోడర్న్ కోడలిగా నటించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్నే చెబుతూ.. ఈ సినిమాను పెద్ద హిట్ చేసినందుకు థాంక్యూ అంటూ ఈ ఫొటోలు పెట్టి పోస్టు చేసింది. ఈ ఫొటోలు చూసిన కొందరు నెటిజన్లు రంగమ్మత్తను మరోసారి ట్రోల్ చేస్తున్నారు. రోజురోజుకు మరీ చిన్నపిల్ల అయిపోతున్నారంటూ వెటకారంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ ప్రస్తుతం సినిమాలపై తన ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పుష్ప-2 సినిమా షూటింగులో బిజీగా ఉంది.