సోషల్ మీడియాలో అనసూయ చేసే హడావిడి అందరికి తెలిసిందే. సడెన్ గా ఏదో ఒక ట్వీట్ వేయడం, దానికి నెటిజన్లు రియాక్ట్ అవ్వడం, మళ్ళీ తనని ట్రోల్ చేస్తున్నారని అనసూయ ఫైర్ అవ్వడం గత కొన్నాళ్లుగా ఇది జరుగుతూనే ఉంది. కొన్ని రోజుల క్రితం అనసూయని ఆంటీ అన్నారని సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేసిందో అందరికి తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ తో, కామెంట్స్ తో సినిమాలు, షోల కంటే కూడా ఈ మధ్య సోషల్ మీడియాలోనే బాగా హైలెట్ అవుతుంది అనసూయ.

అయితే తాజాగా అనసూయ నటించిన విమానం టీజర్ వచ్చింది. ఇక ఇదే ఛాన్స్ అనుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను తెగ ఆడేసుకుంటున్నారు. అనసూయను ట్రోల్ చేస్తున్నారు. ఇలా అడ్డంగా దొరికేసింది వాళ్లకు. సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘విమానం’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

విజయదేవరకొండ పేరు ముందు ‘The’ అని పెట్టుకున్నాడని విమర్శిస్తూ ఇండైరెక్ట్ గా ట్వీట్ చేయడంతో నెటిజన్లు, విజయ్ అభిమానులు అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. దీంతో అనసూయ ఇంకో ట్వీట్ చేసి మరింత రెచ్చగొట్టింది. ఈ సారి పలువురు సెలబ్రిటీలు కూడా విజయ్ కి సపోర్ట్ గా ట్వీట్స్, ప్రమోషన్స్ చేశారు. దీంతో అనసూయకు ఏం చేయాలో తెలియక విజయ్ అభిమానులు, మీడియా మీద ఫైర్ అవుతూ ఓ వీడియో చేసింది. తర్వాత ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.

ఈ పోస్ట్ లో.. నువ్వు ఎవరో నీకు తెలుసు, నీ తప్పు నువ్వు తెలుసుకునే వరకు నేను ఇలాగే చేస్తుంటాను. నా విషయంలో ఏదైతే చేసావో దాన్ని నీకు ప్రతిసారి గుర్తుచేస్తూనే ఉంటాను. దీనివల్ల నాకు బాగా నెగిటివిటీ వస్తుంది అని తెలుసు. అయినా నిజం, మంచితనం, భగవంతుడిపై నాకు నమ్మకం ఉంది. ఏడ్చి సానుభూతి పొందే వ్యక్తిని కాదు. నన్ను ఎంత కిందకు లాగినా, నా మీద ఎంత బురద చల్లినా ఇలాగే ఫైట్ చేస్తుంటాను. వీటన్నిటికీ అర్ధం చెప్పే ఒక రోజు వస్తుందని నమ్ముతున్నాను. నాకు పని లేకపోవడం వల్ల ఇలా చేస్తున్నాను అనుకోకండి. ఇది కూడా నా భాద్యత. నువ్వు నాలోని ఓ తల్లిని టార్గెట్ చేశావు. ఆ తల్లి ఎంత ధైర్యవంతులో నీకు చూపిస్తా అని పోస్ట్ చేసింది.