గత కొన్ని రోజులుగా అనసూయకు సంబంధించిన ఓ ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. నిత్యం ఏదో ఒక కోణంలో ఈ ఇష్యూపై చర్చలు నడుస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే విజయ్ దేవరకొండ పేరు ముందు “The’ అని పెట్టడాన్ని తప్పుబడుతూ పరోక్షంగా అనసూయ ట్వీట్ పెట్టిందో అప్పటినుంచి నెట్టింట దుమ్ముదుమారం కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ- సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఖుషి సినిమా విషయంలో అనసూయ వేలు పెట్టింది. విజయ్ దేవరకొండ పేరు ముందు ‘The’ అని పెట్టడంతో దీన్ని ఈ యాంకరమ్మ తప్పుబట్టింది. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ వర్డ్స్ తో కెలికింది.

తాజాగా మరోసారి నోరుపారేసుకుంది. తాజా వివాదంలో కూడా మీడియాని తప్పుపడుతూ ఉచిత సలహాలు ఇచ్చింది. కళ్లకి కూలింగ్ గ్లాస్‌లు పెట్టి.. బీభత్సమైన యాటిట్యూడ్ చూపిస్తూ తన ఫేస్ బుక్ స్టోరీలో వీడియో వదిలింది. ‘నస పెట్టను సూటిగా పాయింట్‌కి వచ్చేస్తా.. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్.. మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్లపై వార్తలు రాసి పొట్ట నింపుకునేవాళ్ల కోసం నేను చెప్పబోతున్నాను. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏసుకున్నారు. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏడిపించారు.. ట్రోల్ చేశారు.. అని కాదు రాయాల్సింది.

మీకింకా దునియా దారి తెలియదని చెప్తున్నా.. మీకు క్లారిటీ ఇస్తున్నా.. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డ వాడు కాదు.. అన్నవాడి నోరే కంపు.. మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారాలు తిని ఉంటే నిజం రాయండి. నేను ధైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. చేతకాని వాళ్లు అదుపుతప్పారు. ఇది మీరు రాయాల్సింది’ అంటూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసింది అనసూయ. అంటే ఇంకా ముందు ముందు ఇలా కెలుకూతూనే ఉంటానని అనసూయ చెప్పకనే చెప్పింది. దీనిపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భీభత్సం చేస్తున్నారు. కామెంట్లతో రెచ్చిపోతున్నారు.