అనసూయ భరద్వాజ్.. ఈ బ్యూటీ బర్త్ డే నిన్ననే అయినా.. సోషల్ మీడియాలో మాత్రం ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. అనసూయ అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. వాళ్లందరికీ థాంక్స్ చెబుతూ ఈ భామ కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ పెట్టిన ఓ పోస్టు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేసింది అనసూయ. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది..? అనసూయకు బెస్ట్ బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది ఎవరు..?

అనసూయకు విమానం మూవీ సెట్ క్రేజీ బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది. సెట్ ను బర్త్ డే వేడుకకు అనుగుణంగా అలంకరించి బెలూన్స్ తో ఈ బ్యూటీకి వెల్ కమ్ పలికింది. ఆ తర్వాత కేక్ కట్ చేయించి విషెస్ తెలియజేసింది. ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను అనసూయ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్టు చేసింది. దాని కింద ఓ అద్భుతమైన క్యాప్షన్ రాసుకొచ్చింది.
‘చాలా చాలా చాలా చాలా అందమైన సినిమా. ఆ సినిమాలో నేనూ ఓ భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంతే కాదు ఆ సినిమా సెట్ లో నాకు ఎంతో మందితో బలమైన బంధం ఏర్పడింది. నా బర్త్ డే రోజున స్పెషల్ గా పార్టీ ఇచ్చినందుకు చాలా థాంక్స్ హీరో గారు, ప్రొడ్యూసర్ గారు. ఈ టీమ్ ఇచ్చిన నా బర్త్ డే సెలబ్రేషన్స్ తో నా లైఫ్ లోనే నేను చాలా చాలా బ్యూటీఫుల్ జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నాను. ఆ జ్ఞాపకాలను ఈ రీల్ ద్వారా మీతో పంచుకుంటున్నాను. ఈ అద్భుతమైన సినిమాను మీరు ఎంతో త్వరగా చూడాలని నేను కోరుకుంటున్నాను’ అంటూ అనసూయ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన అనసూయ ఫ్యాన్స్ చాలా సంబురపడి పోతున్నారు. మూవీ టీమ్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. సినిమా క్రూ నీ బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటే చూడటం చాలా హ్యాపీగా ఉంది అనూ అంటూ మరికొందరు నెటిజన్లు అంటున్నారు. ఇక హ్యాపీ బర్త్ డే అనసూయ అనే కామెంట్లతో ఇన్ బాక్స్ మొత్తం నిండిపోయింది.