నాకు కావాల్సింది పొందే వరకు వదలను.. అనసూయ అసలు తగ్గట్లేదుగా..

- Advertisement -

అనసూయ గత రెండు మూడు రోజులుగా వార్తల్లో విపరీతంగా ట్రెండ్ అవుతూనే ఉంది. నిన్న ఓ వీడియోను తన స్టోరీలో పెట్టేసింది. అందులో తన మీద రకరకాలుగా వార్తలు రాసిన మీడియాకు నీతులు చెప్పింది. అనసూయను హీరోల ఫ్యాన్స్ ఏసుకుంటున్నారు.. ఆడేసుకుంటున్నారు అని రాశారంటూ మండి పడిపోయింది. ధైర్యంగా నిలబడి నిజం చెప్పిన అనసూయ.. హద్దులు దాటిన అభిమానులు అని రాయాలి అంటూ మీడియాకు సూచించింది. ఉప్పు కారం తింటే అలా రాయాలంటూ నీతులు వల్లించింది. పడ్డోడు ఎప్పుడూ చెడ్డోడు కాదంటూ సూక్తులు కూడా చెప్పింది.

అనసూయ
అనసూయ

నాకు న్యాయం, ధర్మం మీద చాలా న‌మ్మ‌కం ఉంది.. ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని సింపతీ పొందడానికి నేనేమి మోసగత్తెను కాదు. నేను అలా చేయను. మీరు ఎంత క్రిందకు లాగినా, బురద జల్లినా నా పోరాటం మాత్రం ఆగ‌దు. ఈ వివాదంలో ఎవరు తప్పో ఎవరు ఒప్పో తెలుసుకునే రోజు త‌ప్ప‌క‌ వస్తుంది. నేను అటెన్షన్ కోరుకుంటున్నాను అయితే మీరు అనుకుంటున్నట్లు కాదు. నా వర్క్, టాలెంట్ నాకు అటెన్షన్ తెచ్చిపెడతాయి. దానికి నేను అర్హురాలిని. అటెన్షన్ కోరుకోవడం నా వృత్తిలో భాగం. అలా అని నాకు పని లేదు, అందుకే అటెన్షన్ కోరుకుంటుందని అనుకోకండి. నాలోని అమ్మను కూడా టార్గెట్ చేశారు. ఆమె తిరగబడితో ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయించడానికి నేనేమీ బలహీనురాలిని కాదు… అని అనసూయ సందేశం పోస్ట్ చేసింది. చూస్తుంటే ఇప్ప‌ట్లో అన‌సూయ త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు.

ఖుషి సినిమా పోస్టర్ మీద ది విజయ్ దేవరకొండ అని ఉండటం, దాని మీద అనసూయ సెటైర్ వేయడం.. దీంతో రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా అనసూయను టార్గెట్ చేయడం తెలిసిందే. హరీష్‌ శంకర్ లాంటి దర్శకుడు కూడా అనసూయకు కాలేలా.. ది ట్యాగ్‌ను విజయ్‌కు అంటించాడు. అలా రెండ్రోజుల నుంచి ఈ హీట్ కొనసాగుతూనే ఉంది. పైగా ఆంటీ అంటూ మళ్లీ అనసూయను ట్రోల్ చేయడం ప్రారంభించారు. కొంత మంది అనసూయకు మద్దతుగా ఉంటే.. ఇంకొంత మంది అనసూయను తిట్టిపోస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here