Ananya Pandey : బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్యా పాండే ప్రజెంట్ వెకేషన్ మూడ్ లో ఉంది. ఈ బ్యూటీ ప్రకృతిలో సూపర్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆ ఫొటోలను కాస్త తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు కాస్త నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ వెకేషన్ పిక్స్ లో అనన్య బ్యాక్ లెస్ ఫొటోలతో కనువిందు చేసింది. బేర్ బాడీతో ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు అనన్యా బోల్డ్ నెస్ కు ఫిదా అయ్యారు. బికినీలోనూ భామ సందడి చేసింది. ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. తన అందంతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది.

ఏ ఔట్ ఫిట్ లో అయినా అనన్యా తన అందంతో మెస్మరైజ్ చేయడం గ్యారెంటీ, వెస్టర్న్, ట్రెడిషనల్, ట్రెండీ, బోల్డ్… ఇలా ఏ ఔట్ ఫిట్ లో అయినా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెకేషన్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను చూసి కుర్రాళ్లు మరోసారి ఈ లైగర్ బ్యూటీ ప్రేమలో పడిపోయారు.

ఇక అనన్య సినిమాల సంగతికి వస్తే.. బీ టౌన్ లో ఈ భామ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా నార్మల్ టాక్ సంపాదించుకున్నా.. నెపో కిడ్ కావడం వల్ల అనన్యా బాగా ట్రోల్ అయింది. అయినా ఈ బ్యూటీకి అవకాశాలు మాత్రం తగ్గలేదు.

వరుస అవకాశాలతో అనన్య సూపర్ గా బిజీ అయిపోయింది. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి లైగర్ మూవీతో టాలీవుడ్ లో అరంగేట్రం చేసింది. ఇక అనన్యా పాండే ప్రస్తుతం ఆయుష్మాన్ ఖురానాతో కలిసి డ్రీమ్ గర్ల్ 2, సిద్ధాంత్ చుతర్వేదితో కలిసి కో గయే హమ్ కహా సినిమాల్లో నటిస్తోంది. ఇక కాల్ మీ బే అనే సిరీస్ లో నటిస్తోంది.