Ananya Panday : ఆ హీరోతోనే కోరిక తీరుతుందంటున్న లైగర్ బ్యూటీ…

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు జోడిగా లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేక పోయింది.. దాంతో ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

అనన్య పాండేకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు.. అందం ఉన్నా కూడా నటనతో మెప్పించలేకపోయింది.. దాంతో అమ్మడుకు సినీ అవకాశాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా స్టార్ హీరోయిన్ గా సక్సెస్ కాలేకపోతుంది.. హీరోయిన్‌ గా తెలుగు లో లైగర్‌ చేసి ఫ్లాప్ అయినా, స్టార్ కిడ్ కావడం వల్ల బాలీవుడ్‌ లో మాత్రం ఈ అమ్మడికి ఆఫర్లు వస్తూ ఉండటం విశేషం..

- Advertisement -

ఇదిలా ఉండగా… తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఇటీవల ఓ మీడియాతో ముచ్చటించిన అనన్య తన మనసులోని కోరికను బయటపెట్టింది.. ఈ అమ్మడుకు తమిళ స్టార్ హీరో విజయ్ తో ఒక్క సినిమా చెయ్యాలని ఉందనే కోరిక ఉన్నట్లు చెప్పింది.. విజయ్ దళపతి తన చివరి సినిమా గోట్ అని ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీగా ఉండనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీంతో ఈ అమ్మడు కోరిక తీరదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నట్లు తెలుస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here