Kalki 2898 AD అప్డేట్ ఆగయా.. అశ్వత్థామ గ్లింప్స్ చూశారా? గూస్ బంప్స్ అంతే

- Advertisement -

Kalki 2898 AD : ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా నుంచి అప్డేట్ వస్తుందా అని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఇండియన్ సినిమాలో హైయ్యెస్ట్ బడ్జెట్ లో పవర్ ఫుల్ కాస్ట్ తో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ మూవీ ‘కల్కి 2989 ఏడీ’ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. అయితే అది ప్రభాస్ కు సంబంధించిన అప్డేట కాదు.. ఆ సినిమాలో నటిస్తున్న మరో ప్రముఖ నటుడి క్యారెక్టర్ అప్డేట్. అయితేనేం.. తమ హీరో సినిమా అప్డేట్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Kalki 2898 AD
Kalki 2898 AD

కల్కి సినిమా నుంచి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన వీడియో గ్లింప్స్ ను ఇవాళ చిత్రబృందం విడుదల చేసింది. ఆయన ఈ సినిమాలో అశ్వత్థామగా కనిపించనున్నారు. ఓ స్పెషల్ వీడియో ద్వారా రివీల్ చేసిన ఈ లుక్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. గ్లింప్స్ చూసిన అభిమానులు సూపర్​గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోందంటున్నారు. అమితాబ్ పాత్రే ఇంత పవర్ ఫుల్ గా ఉంటే ఇక తమ హీరో ప్రభాస్ పాత్ర ఇంకెంత పవర్ ఫుల్ గా ఉంటుందోనని అంటున్నారు.

ఈ వీడియో మొదలవగానే ఓ చిన్న పిల్లాడు.. ఏంటీ.. నీకు మరణం లేదా.. నువ్వు దేవుడివా.. అసలు ఎవరు నువ్వు అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు అమితాబ్ దానికి సమాధానం ఇస్తూ.. ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురుచూస్తున్న ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామను అని చెబుతారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

- Advertisement -

అయితే ఈ సినిమా నుంచి అప్డేట్ అనగానే ఫ్యాన్స్ అందరూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని అనుకున్నారు. కానీ ఈసారి వాళ్లకు నిరాశే ఎదురైంది. ఈ సినిమాను మొదట మే9వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఈరోజు వీడియో గ్లింప్స్ లో మాత్రం బిగ్ బి యాంగ్రీ యంగ్ మ్యాన్ లుక్, ఓల్డ్ లుక్ – రెండు చూపించి పాన్ ఇండియా ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆయన ద్రోణాచార్య పుత్రుడు అశ్వత్థామ పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.

ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ మైథలాజికల్ సైన్స్​ఫిక్షన్​ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్​తోపాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దీశా పటానీ లీడ్ రోల్స్​లో నటిస్తున్నారు. వీరితోపాటు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్, పశుపతి తదితరులు ఆయా పాత్రలు పోషించనున్నారు. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్​పై తెరకెక్కుతునన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here