Amitabh Bachchan : బాలివుడ్ బాద్షా అమితాబ్ కు షూటింగ్ లో ప్రమాదం జరిగింది..ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ K షూటింగ్ లో ఓ యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా తనకు ప్రమాదం జరిగి గాయాలయ్యాయని అమితాబ్ స్వయంగా పేర్కొన్నారు..అదే సమయంలో ఆయన నడుముకు తీవ్ర గాయం అవ్వడంతో హైదరాబాద్ లోని ఎఐజి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు..కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తానూ తన హోమ్ టౌన్ ముంబై చేరుకున్నానని చెబుతూ.. అక్కడే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలిపారు.. ఇందుకు సంబందించిన వార్తలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి..

అమితాబ్ బచ్చన్‌కు షూటింగ్ లో గాయపడ్డారని తెలిసి ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. ఆయన తిరిగి వెంటనే కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అమితాబ్ గాయ పడటంతో ప్రాజెక్ట్ K షూటింగ్ ప్రస్తుతం వాయిదా పడినట్లు తెలుస్తుంది..ప్రభాస్ ప్రస్తుతం వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్.. ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే అమితాబ్ తో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా ఊహించని విధంగా ప్రమాదం చోటు చేసుకుంది..

ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన అప్ డేట్స్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరిలో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక ప్రభాస్ ఈ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఓ విజువల్ వండర్‌గా ఉండేలా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు నాగ్ అశ్విన్. పాన్ వరల్డ్ స్థాయిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుండటం తో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చేస్తున్నారు.. ప్రాజెక్ట్ K స్టోరీ పెద్దది కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా విడదీసి రూపొందిస్తున్నట్లు చెప్పుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.. దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది..వచ్చే ఏడాది 2024 సంక్రాంతి కానుకగాసినిమాను విడుదల చేయనున్నారు..