Aishwarya – Abhishek : బాలీవుడ్ జంట విడిపోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. వారు మరెవరో కాదు.. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ సర్కిల్లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా అమితాబ్ బచ్చన్.. ఐశ్వర్య రాయ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా ట్విటర్లో ఆయన షేర్ చేసిన పోస్ట్ కూడా పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఐశ్వర్య రాయ్‌ను అమితాబ్ బచ్చన్ అన్‌ఫాలో చేశారని వార్తలు వచ్చిన తర్వాత ట్విటర్లో ఆయన చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.

‘అంతా అయిపోయింది’ అన్నట్టుగా అర్థం వచ్చేలా ఒక కొటేషన్‌ను షేర్ చేశారు బిగ్ బీ. అంతా అయిపోయింది అంటే ఏంటి అర్థం? అసలు అమితాబ్ దేని గురించి మాట్లాడుతున్నారు? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే అమితాబ్ ముందు నుంచి ఐశ్వర్యను ఫాలో చేయడం లేదా లేక ఈమధ్యే అన్‌ఫాలో చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మొదటినుంచి ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం లేదని మరికొందరు అనుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ ట్వీట్ మాత్రమే కాదు.. అభిషేక్ ప్రవర్తన కూడా విడాకుల వార్తలు నిజమే అనిపించేలా చేస్తోంది. తాజాగా ఒక సమావేశంలో పాల్గొన్న అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను పెట్టుకోలేదు.

సాధారణంగా అభిషేక్.. తన పెళ్లి రింగ్‌ను ఎప్పుడూ తీసేయడని, కానీ ఈమధ్య ఆయన చేతికి ఆ రింగ్ కనిపించడం లేదని సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్లో గతకొంతకాలంగా ఈ వార్తలు వైరల్ అవుతున్నా.. బచ్చన్ ఫ్యామిలీ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రాలేదు. ప్రస్తుతం ఎవరి సినిమాల్లో వారు బిజీగా గడిపేస్తున్నారు. ఐశ్వర్య కూడా మళ్లీ ఫామ్‌లోకి రావడానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒకట్రెండు చిత్రాల్లో నటించినా.. మళ్లీ యాక్టింగ్‌కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.