Amardeep : ఆత్మాభిమానం లేని మనిషిగా.. బిచ్చగాడిగా మిగిలిపోయిన అమర్ దీప్.. ఇది కూడా ఒక్క గెలుపేనా?

- Advertisement -

Amardeep : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా వచ్చిన భోలే అమర్ దీప్ ని ఒక మాట అనేవాడు..పదేళ్ల వయస్సు కూడా లేని చిన్న పిల్లవాడివి నువ్వు అని. కానీ భోలే చాలా తప్పుగా మాట్లాడాడు అని ఈరోజు అనిపిస్తుంది. అమర్ దీప్ పదేళ్ల చిన్నపిల్లవాడిగా కాదు, అంత కంటే తక్కువ వయస్సు ఉన్న వాడు కూడా ఆలోచించలేని మనిషి అని, ఆత్మాభిమానం ఇసుమంత కూడా లేని జడ పదార్థం అని నిన్నటి ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది. ఇతన్ని చూసి జాలిపడాలో , కోపం తెచ్చుకోవాలి తెలియని పరిస్థితి. వాస్తవానికి ఈ వారం ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులో అమర్ దీప్ అద్భుతంగా ఆడాడు. అర్జున్ మరియు ప్రశాంత్ తో పోటీ పడి సమఉజ్జీవుడిని అని నిరూపించుకున్నాడు. కానీ ఇంత కష్టపడి ఆడి బూడిదలో పోసిన పన్నీరు లాగ చేసుకున్నాడు అమర్.

Amardeep
Amardeep

అడుక్కోవడం అనేది అమర్ దీప్ కి గత రెండు మూడు వారాల నుండి అలవాటు అయిపోయింది. మొదటిసారి అడుక్కున్నప్పుడు అయ్యో పాపం అని అనిపించింది, రెండవసారి అడ్డుకున్నప్పుడు కూడా పాపం అనే అనిపించింది కానీ ప్రతీ దానికి ఏడవడం అవసరమా అనిపించింది. కానీ మూడవ సారి అడుక్కున్నప్పుడు మాత్రం అమర్ దీప్ అభిమానులకు కూడా చిరాకు కలిగించింది. అది ఏ రేంజ్ అడుక్కోవడం అంటే తన ఆత్మాభిమానం ని తాకట్టు పెట్టుకునే రేంజ్ లో అన్నమాట. మొదటి టాస్కు లో ఓడిపోయిన శివాజీ ని పాయింట్స్ అడిగాడు , శివాజీకి వేరే ఛాయస్ లేక ఆ పాయింట్స్ ని అమర్ కి ఇచ్చేసాడు. అలా శివాజీ మరియు శోభా అందించిన పాయింట్స్ తో టాప్ స్థానం కి చేరుకున్నాడు అమర్ దీప్. అదే టాప్ స్థానం ని కాపాడుకుంటూ అన్నీ రౌండ్స్ లో టాప్ 2 లేదా టాప్ 3 స్థానాల్లో గెలిచాడు. రెండు టాస్కులను స్వయంగా గెలిచాడు కూడా.

Amardeep

కానీ ఇంత కష్టపడి ఆడి కూడా అమర్ దీప్ ఓడిపోయిన ప్రతీ ఒక్కరి దగ్గర అడుక్కోవడం వల్ల అతను ఆడిన ఆటని మొత్తం జనాలు మర్చిపోయి కేవలం అడుక్కొని గెలిచాడు అనే ముద్ర వేసుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే తన స్నేహితురాలు ప్రియాంక పట్ల అతను వ్యవహరించిన తీరు మరో ఎత్తు. ప్రియాంక అతనికి పాయింట్స్ ఇవ్వలేదని, కనీసం రెండవ ఛాయస్ లో కూడా ఆమె మనసులో లేడనే విషయం తెలుసుకొని అమర్ దీప్ గుండె బద్దలవ్వడం సహజమే.

- Advertisement -

ఆ సమయం లో అమర్ దీప్ మాత్రమే కాదు ,ఎవరు అతని స్థానం లో ఉన్నా అలాంటి అనుభూతిని పొందుతాడు. అయితే ఆ క్షణం లో బాధపడ్డాడు, అక్కడితో వదిలేసి ఉంటే అమర్ దీప్ జెంటిల్ మెన్ అనిపించుకునేవాడు. కానీ ఏ కంటెస్టెంట్ పాయింట్స్ పట్టికలో తనకి దగ్గరకి వచ్చినా భయపడుతూ ప్రియాంక చేసిన విషయాన్నీ తలచుకొని ఆమెని ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగాలేదని చూసే జనాలకు అనిపించింది.

ఆమె అమర్ దీప్ ని తట్టుకోలేక గౌతమ్ దగ్గరకి వెళ్లి ఏమాత్రం ఛాన్స్ ఉన్నా అమర్ కి పాయింట్స్ ఇవ్వు అనడం, గౌతమ్ అందుకు ఒప్పుకొని అమర్ కి పాయింట్స్ ఇస్తూ ఇది ప్రియాంక వేస్తున్న బిచ్చం అని ముఖం మీద చెప్పినా కూడా ఏమాత్రం ఫీల్ అవ్వకుండా ఆ పాయింట్స్ ని స్వీకరించడం, ఇదంతా అయిపోయాక రాత్రి అర్జున్ వద్దకి వెళ్లి రేపు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నాకు పాయింట్స్ ఇవ్వు అని అడుక్కోవడం, ఇవన్నీ చూసిన అబ్బా అసలు ఏంటి ఇతని మైండ్ సెట్?, మూడవ క్లాస్ చదివే పిల్లోడికి కూడా ఇతనికి మించిన ఆత్మాభిమానం ఉంటుంది కదా అని చూసే జనాలకు అనిపించింది.

Priyanka

ప్రశాంత్ తో సరిసమానంగా ఆడి అన్ని టాస్కులలో పోటీ ఇవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ ఆత్మాభిమానం కోల్పోవడం వల్ల అమర్ దీప్ అసలు గేమ్ ఏమి ఆడలేదు, అడుక్కొని పాయింట్స్ ని సంపాదించుకున్నాడు అనే ఫీలింగ్ ని జనాల్లో నింపేసాడు. ఇతన్ని చూసి జాలిపడాలో, కోపం తెచ్చుకోవాలి అర్థం అవ్వడం లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here