హీరోయిన్ Amala Paul గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అమలాపాల్. నటన, ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలు, కేసులతో ఆమె నిత్యం సావాసం చేస్తుంటారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా నటించి గుర్తింపు పొందారు.. విభిన్న కథలతో సినిమాలు చేస్తూ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.. ఈ మధ్య ఈ అమ్మడు సినిమాకు తెలుగు డైరెక్టర్ వర్మను మించి పోయాయి..అందుకే ఈ మధ్య సినిమాల్లో కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటున్నారు.. ఎప్పటికప్పుడూ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారకు మతి పోగొడుతుంది..
తాజాగా శివరాత్రి స్పెషల్ ఆమె చేసిన పూజకు సంబందించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..తమిళంలో మైనా చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఈమె ఆ తరువాత ప్రముఖ హీరోల సరసన నటించారు. అదేవిధంగా నటిగా మంచి ఫామ్లో ఉండగానే దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే రెండేళ్లలోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత నటిగా కొనసాగుతున్న అమలాపాల్ ఆ మధ్య నిర్మాతగానూ మారి కడావర్ అనే చిత్రాన్ని నిర్మించారు.
అయితే, నటిగా క్రేజ్ తగ్గడంతో తాజాగా ఆధ్యాత్మిక బాట పట్టినట్లు తెలుస్తోంది..క్రిస్టియన్ మతానికి చెందిన అమలాపాల్ ఇటీవల కేరళలోని ఓ హిందూ దేవాలయానికి వెళ్లారు. అయితే అక్కడి అర్చకులు. ఆలయ నిర్వాహకులు అనుమతించకపోవడంతో భంగపడ్డారు. కానీ తన ఆధ్యాత్మిక పర్యటనను మాత్రం ఆపలేదు. ఇటీవల తమిళనాడులోని పళని కుమారస్వామి ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం అమలాపాల్ ఇండోనేషియాలోని బాలి దీవికి వెళ్లి అక్కడ ఓ ఆశ్రమంలో బస చేశారు.. అక్కడే ఉంటూ యోగా చేస్తూ, అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించింది..ఈ విషయాన్ని తానే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అది కాస్త చక్కర్లు కొడుతుంది..