ఇటీవలే క్లీంకార బారసాల వేడుక కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన అతిథులు చెర్రీ- ఉప్సీ గారాలపట్టికి ఎన్నో విలువైన బహుమతులను అందించారు. ఇంకొన్ని బహుమతులు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అప్పట్లో రామ్చరణ్ బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిన్నారితో పాటు చెర్రీ ఉప్సీల కోసం.. బంగారు కాయిన్లను స్పెషల్ డిజైన్ చేయించి.. బహుమతులుగా పంపినట్లు వార్తలు వచ్చాయి.
ఇక తాజాగా అల్లు అర్జున్ క్లీంకారకు ఓ విలువైన కానుకను అందించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బన్నీ బంగారు పలకను బహుమతిగా ఇచ్చారట. ఇప్పుడే పలకేంటి అనుకుంటున్నారేమో? పలక అంటే రాసుకునేది కాదు.. క్లీంకార పేరు, ఆమె పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలు వచ్చేలా డిజైన్ చేయించారట! ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఐకాన్ స్టార్ ఐడియా కొత్తగా ఉందని మురిసిపోతున్నారు.ఇక పాప పుట్టకముందు నుంచే మెగా ఇంటికి కానుకల వెల్లువ మొదలైంది. ఉపాసన సోషల్ మీడియాలో తమ చిన్నారి కోసం చేయించిన ఓ ఊయల గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు.
తమకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రజ్వలా ఫౌండేషన్ ఓ ప్రత్యేకమైన ఊయలను కానుకగా ఇచ్చారంటూ చెప్పుకొచ్చారు. మెగా ఇంటి బుల్లి వారసురాలు ప్రిన్సెస్ క్లీంకార కొణిదెల రాకతో ఆ ఇంట ఆనందాలు వెల్లి విరిశాయి. పుట్టినప్పటి నుంచే తను పేరు మార్మోగిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్చరణ్- ఉపాసన దంపతులకు వివాహం అయిన 11 ఏళ్ల తర్వాత బిడ్డ జన్మనివ్వడం వల్ల ఇటు మెగా ఫ్యామిలీతో పాటు అటు కామినేని ఇంట సంబరాలు అంబరాన్నింటాయి. ఇక చరణ్- ఉపాసనల ఆనందానికైతే అవధుల్లేకుండా పోయింది.