Allu Sirish : ఆ హీరోయిన్ తో అల్లు శిరీష్ ప్రేమాయణం..పెళ్లి ఎప్పుడంటే?

- Advertisement -

Allu Sirish : సాదారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే నటినటులు పెళ్లి చేసుకుంటే ఎక్కువకాలం ఉండరు అని కొంతమంది నమ్మకం. ఈ మధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు మనస్పర్థలు కారణంగా విడిపోతున్నారు.. కానీ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా కలిసి ఉంటారు అనేది మరికొందరి నమ్మకం. నాగార్జున అమల వంటి సెలెబ్రేటిలను చూస్తే ఈ విషయం నిజమే అనిపిస్తుంది.. వారి పెళ్ళై ఎన్నో ఏళ్లు గడిచిన ఇద్దరి మధ్య గొడవలు రాలేదు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వరుణ్ తేజ్ బాటలోనే మరో హీరో కూడా తాను ప్రేమించిన హీరోయిన్ నే పెళ్లాడబోతున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తుంది..

Allu Sirish
Allu Sirish

ఆ హీరో ఎవరో కాదు.. అల్లు శిరీష్ . అవును మీరు వినేది నిజమే.అల్లు శిరీష్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఉండే ఓ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారట. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు.మజ్ను సినిమాతో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న అను ఇమ్మానియేల్.. ఆ సినిమా తర్వాత నటించిన ఏ ఒక్క సినిమా కూడా అంతగా పేరు తెచ్చి పెట్టకపోయినప్పటికీ హీరొయిన్ గా మాత్రం గుర్తింపు ఉంది.. ఇక అను ఇమ్మానియేల్ అల్లు శిరీష్ మధ్య ఊర్వసివో రాక్షసివో సినిమా చేసే టైంలో ప్రేమ చిగురించిందట. సినిమాకన్నా ముందు నెటిజన్స్ వీరి ప్రేమ గురించి ఎన్నో వార్తలు వినిపించాయి..కానీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా వీళ్ళిద్దరూ కూడా మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం పేరెంట్స్ వరకు వెళ్లిందట.. ఇక అల్లు అరవింద్ అనూ ఇమ్మానియేల్ ని ఇంటికి కోడలుగా ఒప్పుకోలేదట.కానీ అల్లు శిరీష్ చేసుకుంటే ఆమెనే చేసుకుంటాను అని పట్టుబట్టడంతో చేసేదేమీ లేక అల్లు అరవింద్ కూడా వారి ప్రేమను యాక్సెప్ట్ చేశారట.ఇక మరికొన్ని రోజుల్లోనే వీళ్ళు కూడా ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేసుకొని పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే వాళ్లు క్లారిటీ ఇచ్చేవరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here