Allu Arha : సోషల్ మీడియా ని ఊపేస్తున్న అల్లు అర్జున్ కూతురు డ్యాన్స్ వీడియో.. తండ్రినే మించిపోయిందిగా!

- Advertisement -

Allu Arha : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కి సోషల్ మీడియా లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్, క్యూట్ క్యూట్ మాటలకు ప్రపంచం లో ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అల్లు అర్జున్ ఈమె విషయం లో చాలా అదృష్టవంతుడు అని ఇతర హీరోల అభిమానులు కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈమెకి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియా లో ఇన్ని రోజులు ట్రెండ్ అవుతూ వచ్చాయి.

Allu Arha
Allu Arha

అంతే కాదు ఈమె సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘శాకుంతలం’ చిత్రం లో కూడా నటించింది. ఇందులో భరతుడి చిన్ననాటి పాత్రని చేసిన అల్లు అర్హ, మొదటి సినిమాతోనే చక్కట్టి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా కూడా అల్లు అర్హ కి మాత్రం మంచి పేరు వచ్చింది. సోషల్ మీడియా లోని ఇంస్టాగ్రామ్ లో ఆమె తల్లి స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడు అల్లు అర్హ కి సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది.

Allu Arha Dance VIdeo

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా అల్లు అర్హకి సంబంధించిన వీడియో స్నేహ రెడ్డి విడుదల చేసింది. ఈ వీడియో లో ‘ఎనిమల్’ చిత్రంలో బాగా పాపులర్ అయిన ‘జమల్’ పాటకు డ్యాన్స్ వేస్తూ కనిపించింది. ‘ఎనిమల్’ చిత్రం లో బాబీ డియోల్ తన తల మీద కప్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తే, అల్లు అర్హ తన తల మీద ప్లేట్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అవుతుంది.

- Advertisement -

కొంతమంది ఈ వీడియో ని చూసి తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, సుకుమార్ తో ఆయన చేస్తున్న ‘పుష్ప : ది రూల్’ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటూ ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లిమ్స్ వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆగస్టు 15 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here