Sneha Reddy : హీరో అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. సినిమాలతో పాటు, ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డికి హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశేయోక్తి కాదు. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందామె. స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ స్నేహారెడ్డికి హీరోయిన్లల మాదిరి క్రేజ్ సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే స్నేహారెడ్డి తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తన భర్త అల్లు అర్జున్ సినిమా విశేషాలతో పాటు, తన పిల్లల విషయాలను సోషల్ మీడియా వేదికగా స్నేహారెడ్డి షేర్ చేస్తుంటుంది. ఇక అల్లు స్నేహా ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు. ఆమె లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారని ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది. తాజాగా స్నేహారెడ్డి తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

బ్లాక్ కలర్ డిజైనర్ వేర్ ధరించి చాలా క్యూట్‌గా అందంగా ఉన్నటువంటి ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫొటోల్లో అల్లు అర్జున్ భార్య గతంలో కంటే మరింత అందంగా కనిపిస్తోంది. స్నేహారెడ్డి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్నేహారెడ్డి గ్లామర్ ఫొటోలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్ ఇంట్లోనే ఓ హీరోయిన్ పెట్టుకున్నాడుగా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు మా వదినమ్మ సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.