Allu Arjun – Sneha : తాను తాగే బ్రాండ్ ఏంటో పబ్లిక్ గా చెప్పేసిన స్నేహారెడ్డి.. అల్లు అర్జున్ పరువు నిలువునా తీసేసిందిగా..

- Advertisement -

Allu Arjun – Sneha : పుష్ప.. ది రైజ్‌ సినిమాతో దేశవ్యాప్తంగా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్‌తో ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్‌కి హీరోగా అభిమానుల్లో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో… ఆయన భార్య స్నేహా రెడ్డికి సైతం సోష‌ల్ మీడియాలో అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది.

Allu Arjun - Sneha
Allu Arjun – Sneha

ఇక వీరిద్ద‌రూ.. ఓ వైపు ప్రొఫెషనల్‌ కమిట్‌మెంట్స్‌తో తీరిక లేకుండా ఉంటునే సమయం దొరికితే వెకేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడుతుంటారు . లండన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలు బన్నీ, స్నేహా రెడ్డిలు నెట్టింట్లో షేర్ చేయగా అవి బాగానే వైరల్ అయ్యాయి. తాజాగా స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో ఓ పోస్ట్ వేసింది. తాను ప్రేమలో ఉన్నా.. లేకపోయినా కూడా శాంపైన్ తాగుతాను అని ఓ కొటేషన్ ఉంది. ఆ కొటేషన్‌ను స్నేహా రెడ్డి షేర్ చేసింది. అంటే తాను కూడా అలానే శాంపైన్ తాగుతానని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

Allu Sneha Reddy

ప్రస్తుతం స్నేహా రెడ్డి తన ఇన్ స్టా స్టోరీలో పెట్టిన ఈ కొటేషన్ మాత్రం తెగ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప.. ది రూల్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ఫిలింనగర్‌ సర్కిల్ టాక్‌. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్న సీక్వెల్‌ పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో కనిపించనుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here