సినిమాల్లోకి అల్లు స్నేహ.. బన్నీకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుందట..!

- Advertisement -

అల్లు స్నేహ.. మనకి ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ భార్యగానే తెలుసు. స్నేహ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన పిల్లలు, ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులే కాకుండా ఫ్రెండ్స్​, వెకేషన్స్​కి సంబంధించినవి.. అప్పుడప్పుడు నేచర్​కి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ట్రెండీగా.. స్టైలిష్​గా కనిపిస్తూ ఉంటుంది. స్నేహ ఫ్యాషన్ సెన్స్​కి ఒకప్పటి స్టైలిష్ స్టార్.. ఇప్పటి ఐకాన్ స్టార్​ కూడా ఫిదానే. హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోకుండా తన ఆహార్యం మెయింటేన్​ చేస్తుంది స్నేహ.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్​గా ఉండే అల్లు స్నేహకి సంబంధించి ప్రస్తుతం నెట్టింట ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఇదంతా పుకార్లేనని కొందరు కొట్టిపారేస్తుంటే.. మరి కొందరేమో నో ఇది నిజం స్నేహ సినిమాల్లోకి వస్తోందని బల్ల గుద్ది చెబుతున్నారు. ఇంకొందరేమో వావ్​.. స్నేహ మూవీస్ చేస్తుందా అని సంబురపడిపోతున్నారు.

- Advertisement -

అయితే అల్లు స్నేహ సినీ అరంగేట్రం టాలీవుడ్​లో కాదట.. మాలీవుడ్​లోనట. మలయాళ ఇండస్ట్రీలో.. కేరళలో.. మన బన్నీకి ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. మన అల్లు అర్జున్​ని వారు తమ వాడిగా భావించి మల్లు అర్జున్​ అని ప్రేమగా పిలుచుకుంటారంటే వాళ్లకి బన్నీ అంటే ఎంత ఇష్టమో వేరే చెప్పనక్కర్లేదు.

ఓ మలయాళ సూపర్ స్టార్​ సినిమాతో ఇప్పుడు అల్లు స్నేహ కూడా మాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మాలీవుడ్​ ప్రేక్షకులు బన్నీని తమ గుండెల్లో పెట్టుకున్నట్లు స్నేహని కూడా ఆదరిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తుంటే మన మల్లు అర్జున్​కి అదేనండి మన అల్లు అర్జున్​కి స్నేహ గట్టి కాంపిటీషనే ఇచ్చేలా కనిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here