Pushpa 2 : తగ్గేదేలే.. బన్నీ కి సలాం కొట్టిన గూగుల్ తల్లి..!

- Advertisement -

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చినా పుష్పా దీ రూల్ సినిమాకి సంబంధించి టీజర్ ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఆ సినిమా అందర్నీ కూడా షాక్ అయ్యేలా చేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంతా గొప్ప సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు పుష్ప టు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా మీద కూడా భారీగానే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

Pushpa 2 teaser
Pushpa 2 teaser review

ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు పుష్ప వన్ హిట్ అవడంతో సీక్వెల్ ని కూడా బాగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సినిమా హిట్ కాకపోతే పరిస్థితి ఎలా ఉందో తెలియదు. కానీ హిట్ అవ్వడం వలన బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని రెండో పార్ట్ ని కూడా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ తోనే తీస్తున్నారు. పైగా ఎక్స్పెక్టేషన్స్ని కూడా ప్రేక్షకులు ఎక్కువగా పెట్టుకున్నారు. అయితే దీనిలో భాగంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న టీజర్ ని రిలీజ్ చేశారు. టీజర్ అంత ఆసక్తికరంగా లేదని కొంతమంది అంటుంటే ఈ మాత్రం చాలు ఇంకెందుకు థియేటర్లకి పరుగులు పెట్టడానికి అని అల్లు అర్జున్ అభిమానులు అయితే కామెంట్లు చేస్తున్నారు.

గూగుల్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించడం హాట్ టాపిక్ అయింది సాదరణంగా గూగుల్ సంస్థ చిన్న విషయాలు మీద లేదంటే సినిమాలు మీద స్పందించదు కానీ ఎందుకో ఏమో కానీ పుష్ప టీజర్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా తగ్గేదేలే అనే పదాన్ని ఇంగ్లీషులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నట్లుగా గూగుల్ ట్రాన్స్లేట్ ఓపెన్ చేసి దేర్ ఇస్ నో లిట్టింగ్ డౌన్ అంటూ ఒక ట్వీట్ చేసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఏకంగా గూగుల్ తల్లి చేత స్పందింప చేసేలా టీజర్ ఉందని ఇంకేం కావాలంటే కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ఫాన్స్ అయితే మాత్రం తెగ సంతోష పడిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here