Allu Arjun : అల్లు అర్జున్ కు మెగాస్టార్ ను మించిన ఫ్యాన్ డమ్.. బర్త్ డే రోజు ఇంటికొచ్చిన అభిమానులు ఏకంగా..?

- Advertisement -

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇవాళ ఏప్రిల్ 8వ తేదీన తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. బన్నీ బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు, ఇతరులు పెద్ద ఎత్తున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హంగామాకు అంతే లేదు. హ్యాపీ బర్త్ డే పుష్పరాజ్, హ్యాపీ బర్త్ డే బన్నీ హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ఇక అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఇవాళ పుష్ప మేకర్స్ పుష్ప – ది రూల్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఫ్యాన్స్ సంతోషానికి అంతే లేదనుకోండి.

తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా బన్నీ ఇంటి వద్దకు వచ్చి ఫ్యాన్స్ హంగామా చేశారు. గట్టిగట్టిగా అరుస్తూ హ్యాపీ బర్త్ డే బన్నీ అంటూ విషెస్ చెప్పారు. తన అభిమానులు తన కోసం వచ్చారని తెలుసుకున్న ఐకాన్ స్టార్ వాళ్లను చూసేందుకు బయటకు వచ్చి వారికి సర్ ప్రైజ్ ఇచ్చారు. తన ఇంటి లోపలి నుంచే అభిమానులకు అభివాదం చేస్తూ బర్త్ డే విషెస్ స్వీకరించాడు. తన పుట్టిన రోజున అంత దూరం స్వయంగా వచ్చి విషెస్ చెప్పినందుకు థాంక్యూ చెప్పాడు. అల్లు అర్జున్ ఆర్మీకి స్పెషల్ థాంక్యూ అంటూ బన్నీ సంబురపడిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా పుష్పరాజ్ కు తన అభిమానులంటే తెగ ప్రేమహే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా బన్నీ కుటుంబం సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బన్నీతో ఉన్న ఫోటోను హ్యాపీ బర్త్డే ఏమోజీతో పాటు కేక్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియాలో “పుట్టినరోజు శుభాకాంక్షలు బావ” అంటూ రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి “పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ, నీకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి” అంటూ విష్ చేశారు. వరుణ్ తేజ్ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పుష్పలో అందరికి నచ్చిన తగ్గేదేలే డైలాగ్​ను క్యాప్షన్​గా రాసి పోస్ట్ చేసారు. ఇంకా చాలామంది అభిమానులు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బన్నీకి విషెస్ తెలిపారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here