Pushpa 2 లో అల్లు అర్జున్ సినిమా మొత్తం చీరలోనే ఉంటాడా..? లీక్ అయిన వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

- Advertisement -

Pushpa 2 : టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, బాలీవుడ్ , కోలీవుడ్ మరియు మాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ సినిమాలలో ఒకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప : ది రూల్’ చిత్రం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ నుండి వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

Pushpa 2
Pushpa 2

బాహుబలి సినిమా సీక్వెల్ కోసం ఎంతలా అయితే ఎదురు చూసారో, ‘పుష్ప : ది రూల్’ చిత్రం కోసం కూడా అంతే ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ చీర గెటప్ లో కనిపించిన లుక్ ఫ్యాన్స్, ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. ఈ లుక్ ని చూసిన ప్రతీ ఒక్కరు అల్లు అర్జున్ డెడికేషన్ కి సెల్యూట్ చేసారు.

Allu Arjun

ఈ లుక్ లో ఉన్న సన్నివేశం జాతర కి సంబంధించినది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నుండి ఒక ఫోటో సోషల్ మీడియా లో లీక్ అయ్యింది. ఇందులో షూటింగ్ గ్యాప్ లో అల్లు అర్జున్ మూవీ యూనిట్ తో కూర్చున్నప్పుడు కూడా చీర వేసుకొనే ఉన్నాడు. అంటే అల్లు అర్జున్ ఈ సినిమా లో చీర లుక్ తో కేవలం ఒక్క సన్నివేశం లో మాత్రమే కాదు, ఎన్నో సన్నివేశాల్లో కనిపిస్తాడు అన్నమాట.

- Advertisement -
Pushpa 2 Part 2

ఒక సన్నివేశం అయితే తీసుకోగలరు కానీ, అన్ని సన్నివేశాల్లో ఒక స్టార్ హీరో చీర లుక్ లో కనిపిస్తే ఆడియన్స్ ఎలా తీసుకోగలుతారు అనేదే ఇప్పుడు పాయింట్. మరోపక్క సినిమా నుండి జరుగుతున్న ఈ లీక్స్ ని చూసి మూవీ మేకర్స్ చాలా ఫైర్ మీద ఉన్నారట. లీక్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here