Allu Arjun : బాబోయ్.. ఏందిది..? ఓ అమ్మాయికి బన్నీ ఇలా మెసేజ్ చేశాడా?

- Advertisement -

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. మన బన్నీ ఓ అమ్మాయికి మెసేజ్ చేశాడా? షాక్ అయ్యారా.. కానీ ఇదే నిజం అనే న్యూస్ వైరల్ గా మారింది. కరోలిన్ షేక్స్ పేరిట ఓ సోషల్ మీడియా అకౌంట్ ఉంది. ఆ అమ్మాయికి బన్నీ మెసేజ్ చేశాడని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. బన్నీ మెసేజ్ చేశాడని కరోలిన్ స్వయంగా తెలిపింది. కాగా.. అసలు ఈ అమ్మాయి ఎవరు? అల్లు అర్జున్ తో రిలేషన్ ఏంటి? అసలు బన్నీ ఎందుకు మెసేజ్ చేశాడో ఓ లుక్ వేద్దాం.

allu arjun
allu arjun


కరోలిన్ షేక్స్ ఫారెనర్ లా కన్పిస్తుంది. ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో 3 లక్షల మంది ఫాలో వర్స్ ఉన్నారు. కాగా.. బన్నీ ఈమెకు పర్సనల్ గా మెసేజ్ చేసినట్లు స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. ” మీ పోస్టులు చాలా క్యూట్ గా, ఫన్నీగా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యు డియర్” అని బన్నీ మెసేజ్ చేసినట్లు స్క్రీన్ షాట్స్ వైరల్ గా మారాయి. మరోవైపు కరోలన్ మెడ్రన్ హెయిర్ స్టైల్ తో చాలా క్యూట్ గా ఫ్యాషన్ రిలేటెడ్ విషయాలని సోషల్ మీడియాలో యాక్టివ్ గా పోస్టు చేస్తుంది.

మరోవైపు హీరో నవదీప్ కూడా కరోలిన్ ని ఇన్ స్టాలో ఫాలో అవుతున్నాడు. మరి బన్ని నెక్ట్స్ మూవీలో కరోలిన్ ని తీసుకునేందుకే మెసేజ్ చేశాడా అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది. లేదా ఎవరైనా అల్లు అర్జున్ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా మెసేజ్ లు పంపారో తెలియాల్సి ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here