Allu Arjun : అరుదైన రికార్డు నమోదు చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

- Advertisement -

Allu Arjun : సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. వారు రికార్డులు సృష్టించడానికే.. వారు సృష్టించిన రికార్డులను వారే బద్దలు కొట్టడానికి అన్నట్లు కొందరు పుడతారు. ముఖ్యంగా ప్రస్తుతం అల్లు అర్జున్ చూస్తే అలాగే ఉంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ తనదైన స్టైల్‌లో ఇండస్ట్రీలో దూసుకు పోతున్నాడు.

Allu Arjun
Allu Arjun

అల్లు అర్జున్‌కి సోషల్ మీడియాలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ అంటే కేరళ జనాలకు పిచ్చ అభిమానం. వారు అల్లు అర్జున్ కోసం ఏమైనా చేస్తారు.. అతడిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య లక్షల్లో ఉంది. బన్నీకి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 25 మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నాడు.

allu-arjun-rashmika

- Advertisement -

ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఇంత క్రేజీ రికార్డ్ సాధించిన తొలి హీరో అనే అరుదైన గౌరవాన్ని ఈ ఐకాన్ స్టార్ అందుకున్నాడు. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ 21 మిలియన్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 20 మిలియన్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 25 మిలియన్ల మంది ఫాలోవర్స్ అంటే మాటలు కాదు. ఎంతో మంది అభిమానులు ఆయనను ఇష్టపడుతుంటారు. అందుకే ఇలాంటి అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ మ్యాటర్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here