Allu Arjun : అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రూల్ చేస్తున్న విషయం తెలిసిందే. తన రాబోయే పుష్ప 2 సినిమా కోసం ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది. ఇంత ఎదిగాడంటే దాంట్లో తన కష్టం ఎంత ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ రేంజ్ లో కష్టపడాలి, ఎంత క్రమశిక్షణ ఉండాలో ఆలోచించొచ్చు. తాజాగా అల్లు అర్జున్ దీని గురించి మాట్లాడాడు. ఆర్య 20 ఏళ్ళ వేడుకలో బన్నీ ఓ ఆసక్తికర సంఘటనని తెలియచేశారు. అల్లు అర్జున్, అను జంటగా శివ బాలాజీ, రాజన్ దేవ్, సుబ్బరాజ్, సునీల్, వేణు మాధవ్.. పలువురు ముఖ్య పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన సినిమా ఆర్య.
ఆర్య సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో తెలిసిందే. 7 మే 2004లో ఆర్య సినిమా రిలీజవ్వగా తాజాగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇలాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చినందుకు ఆర్య 20 ఏళ్ళ వేడుక చేసి మూవీ యూనిట్ అంతా హాజరయ్యారు. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ. నా లైఫ్ లో ఇంపాక్ట్ చూపించింది, నా లైఫ్ మార్చింది సుకుమార్. ఇంకో 30, 40 ఏళ్ల తర్వాత కూడా నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో సుక్కునే ఉంటాడు. ఆయనంత క్లోజ్ నాకు ఇంక ఎవ్వరూ అవ్వలేదు. గంగోత్రి తర్వాత ఇంజిన్ లేని భోగిలా నేను వెళ్తుంటే ఆర్య సినిమాతో వచ్చి నన్ను లైన్ లో పెట్టాడు. నేను ఇవాళ ఇక్కడ నిల్చున్నాను రెండు కాళ్ళ మీద అంటే అది సుకుమార్ వల్లే. సుకుమార్ కి జీవితాంతం రుణపడి ఉంటాను. లవ్ యు సుక్కు డార్లింగ్ అంటూ ఎమోషనల్ అయ్యాడు బన్నీ.
అలాగే ఆర్య షూటింగ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ ను కూడా చెప్పుకొచ్చాడు. నాకు న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. రాత్రంతా పార్టీ చేసుకున్నా. పొద్దున్నే షూటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. తకదిమిథోమ్ సాంగ్ కి స్పెషల్ లొకేషన్స్ వెతుకుతున్నారు. గంగవరం దగ్గర పర్మిషన్ వచ్చింది. దీంతో వెంటనే షూట్ చేయాలి, రమ్మన్నారు. షూటింగ్ కి వెళ్తే ఎండ, నిద్ర లేదు చాలా కష్టపడ్డాను. ఆ రోజు డిసైడ్ అయ్యాను. షూటింగ్ ఉన్న ముందు రోజు ఎట్టి పరిస్థితుల్లోని తొమ్మిది గంటలకే పడుకోవాలి. నేను 8 గంటలు నిద్ర లేకుండా షూటింగ్ చేయలేను. అలాగే షూటింగ్ ముందు రోజు పార్టీలు చేసుకోకూడదని గట్టిగా ఆ రోజే ఫిక్స్ అయ్యా. ఇవాళ్టి వరకు కూడా మధ్యలో ఎప్పుడో ఒకటి, రెండు సార్లు తప్ప ఆ రూల్ ఇప్పటికి బ్రేక్ చేయలేదు కాబట్టే ఇవాళ ఇలా ఉన్నానంటూ ఆయన చెప్పుకొచ్చారు.