Allu Arjun : ‘బేబీ’ హీరోయిన్ వైష్ణవి చైతన్య కి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. కారణం అదేనా!

- Advertisement -

Allu Arjun : యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ మరియు కవర్ వీడియో సాంగ్స్ చేసుకుంటూ, అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో ఆడియన్స్ ని పలకరిస్తూ పాపులారిటీ ని సంపాదించుకున్న నటి వైష్ణవి చైతన్య. ఎప్పుడైతే ఆమె ‘సాఫ్ట్ వేర్ డెవలపర్’ అనే వెబ్ సిరీస్ చేసిందో అప్పటి నుండి ఈమెకి టాలీవుడ్ అవకాశాలు భారీ గా క్యూ కట్టాయి. ఎన్ని అవకాశాలు వచ్చినా అన్నీ సైడ్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యింది వైష్ణవి.

Allu Arjun
Allu Arjun

కానీ ఆనంద్ దేవరకొండ తో కలిసి ఆమె చేసిన ‘బేబీ’ చిత్రం ద్వారా మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ లో ఈమెకి ఉన్న క్రేజ్ వేరు. అది దృష్టిలో పెట్టుకొనే ఈమెకి టాలీవుడ్ లో వరుసగా ఇప్పుడు హీరోయిన్ రోల్స్ ఇవ్వడానికి ఎగబడుతున్నారు దర్శక నిర్మాతలు.

Vaishnavi Chaitanya

ప్రస్తుతం ఈమె క్రేజీ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తో ఒక సినిమా, అలాగే అండ్ దేవరకొండ తో మరో సినిమా చేస్తుంది. ఈ రెండు కాకుండా టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ రీసెంట్ గానే వైష్ణవి చైతన్య కి 20 లక్షల రూపాయిల చెక్ ని బహుమతిగా వైష్ణవి కి పంపాడట.

- Advertisement -
Vaishanavi Chaitanya photos

అల్లు అర్జున్ నాకు ఇంత డబ్బులు గిఫ్ట్ గా పంపడం ఏమిటి అని ఆశ్చర్యపోయి ఆయనకీ కాల్ చెయ్యగా, దానికి అల్లు అర్జున్ గారు నువ్వు మా గీత ఆర్ట్స్ లో త్వరలోనే ఒక సినిమా చెయ్యాలి, మంచి క్రేజీ ప్రాజెక్ట్, ముందుగానే అడ్వాన్స్ ఇస్తున్నాను, ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తాము అని అల్లు అర్జున్ అన్నాడట. అంత పెద్ద స్టార్ ప్రత్యేకంగా తన కోసం చెక్ పంపి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు వైష్ణవి చైతన్య ఆనందానికి హద్దులే లేకుండా పోయిండట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here