Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ సెన్సేషన్. పుష్ప సినిమాతో టాలీవుడ్ రేంజ్ ను అమాంతం ఆకాశానికి ఎత్తేశాడు. ఆ సినిమాతో బాలీవుడ్ కూడా తన నటనకు ఫిదా అయ్యేలా చేశాడు. యూత్ కు ఫ్యాషన్ ఐకాన్ గా, స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరో తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ప్రతిసారి మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. ఇవాళ (ఏప్రిల్ 8వ తేదీన) అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఏప్రిల్ 8 1982లో జన్మించిన బన్నీ అలనాటి హాస్య నటుడు అల్లు రామలింగయ్య మనవడు, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తనయుడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇవాళ బన్నీ బర్త్ డే సందర్భంగా తన సినిమా కెరీర్ లో బన్నీ సృష్టించిన రికార్డుల గురించి తెలుసుకుందాం.
2002 చిరంజీవి డాడీ సినిమాలో ఓ టీనేజర్ పాత్రలో మెరిసినబన్నీ.. అనంతరం 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా మారాడు. 2004లో వచ్చిన ఆర్య సినిమా డైరెక్టర్‌గా సుకుమార్‌కు, హీరోగా బన్నీ కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇచ్చింది. అక్కడ మొదలైన విజయ జైత్రయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అలా స్టార్ హీరో అయిన బన్నీ పాపులారిటీ కేవలం టాలీవుడ్ కే పరిమితం కాలేదు. మలయాళంలోనూ బన్నీ సినిమాలు సూపర్ హిట్. అక్కడి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఇలా మాలీవుడ్ లో సూపర్ క్రేజ్ దక్కించుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ హిస్టరీ క్రియేట్ చేశాడు.
20 ఏళ్ల సినిమా కెరీర్ లో బన్నీ క్రియేట్ చేసిన రికార్డులు ఇవే..
- ఈ 20ఏళ్ల కేరీర్లో బన్నీ నటనతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్‌లో ఒక్క ఫొటో పోస్ట్‌తో 1 మిలియన్ ఫాలోవర్ అందుకున్న తొలి నటుడు అల్లు అర్జున్ మాత్రమే.
- ఇన్‌స్టాగ్రామ్ డాక్యుమెంటరీ వీడియో చేసిన మొదటి హీరో కూడా బన్నీయే. ఇందులో పుష్ప 2 సెట్స్‌తో పాటు బన్నీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని చూపించాడు.
- మరోవైపు యూట్యూబ్‌లోనూ బన్నీ రికార్డు ఓ సెన్సేషన్. బోయపాటి బన్నీ కాంబినేషన్లో వచ్చిన సరైనోడు యూట్యూబ్‌లో 300 మిలియన్ల వ్యూస్ దాటిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది.

- బన్నీని పాన్ ఇండియా స్టార్‌గా చేసిన పుష్ప సినిమా ఆడియో ఆల్బమ్ కూడా యూట్యూబ్‌లో 5 బిలియన్ల వ్యూస్ దాటి సంచలనం సృష్టించింది. ఈ మార్క్ అందుకున్న మొదటి ఇండియన్ ఆల్బమ్ పుష్పనే.
- తెలుగు వారికి ఇన్నేళ్లూ అందని ద్రాక్షగా మిగిలిన నేషనల్ అవార్డు పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్‌కు వరించింది. బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు అందుకున్న మొదటి తెలుగు యాక్టర్ బన్నీనే.
- దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం ఉన్న మొదటి టాలీవుడ్ యాక్టర్, తొలి సౌత్ ఇండియన్ యాక్టర్ కూడా ఐకాన్ స్టారే.
- దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న మొదటి టాలీవుడ్ హీరో కూడా అల్లు అర్జునే.
- న్యూయార్క్ సిటీ గ్రాండ్ మార్షల్లో పాల్గొన్న మొదటి టాలీవుడ్ హీరో మన పుష్ప రాజే.