Allari Naresh : నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్

- Advertisement -

Allari Naresh : ఎక్కువగా కామెడీ సినిమాలు చేసే అల్లరి నరేశ్ ఈ మధ్య రూటు మార్చారు. మొన్న ఆ మధ్య ‘నాంది’ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ‘నాంది’తో అల్లరి నరేష్‌ మంచి కంబ్యాక్‌ ఇచ్చాడు. కంబ్యాక్‌ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్‌గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్‌ పెరిగింది.తాజాగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేశ్ ‘ఉగ్రం’ సినిమా చేశారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 5న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది.

Allari Naresh
Allari naresh

ఈ ప్రమోషన్‌లో భాగంగా నరేష్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సినిమాలోని ఓ ఫైట్‌ సీన్‌ కోసం నరేష్‌ నాలుగు రోజుల్లో 500వరకు సిగరెట్లు తాగినట్లు తాజాగా ఓ ఇంటర్వూలో చెప్పాడు. దాంతో దగ్గు, జ్వరంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతిన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక సీన్‌ కోసం ఇంత రిస్క్‌ చేశాడా అని అందరూ షాక్‌ అవుతున్నారు. పలువురు నెటిజన్లు డెడికేషన్‌ అంటే నీది నరేష్‌ అన్నా అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక ఇటీవల మేకర్స్ కూడా ఈ సినిమా గురించి ఓ విషయం చెప్పారు. తప్పిపోయిన వ్యక్తుల గురించి హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాకు మెయిన్ పాయింట్. ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా సినిమా డైరెక్టర్.. మిస్సింగ్ కేసుల గురించి మాట్లాడారు.

Allari Naresh Movies

“సాధారణంగా న్యూస్ పేపర్లు, టీవీ ఛానెల్‌ల స్క్రోలింగ్‌లలో మిస్సింగ్ వార్తలు వచ్చినప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మిస్సింగ్ కేసుకు సంబంధించిన ఏదైనా వార్త వినిపిస్తే వణుకుతారు’’ అని ఉగ్రం దర్శకుడు చెప్పారు. ఇక ఇప్పటి వరకు రిలీజైన టీజర్‌, ట్రైలర్‌లు సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్‌ చేశాయి. క్రైమ్ థ్రిల్లర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్‌ నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here