Actor Surya : ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ వేస్ట్.. 25 ఏళ్ల కెరీర్ పై సూర్య కామెంట్స్..

- Advertisement -

Actor Surya : గొప్ప సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు సూర్య..ఈ ప్రెస్టీజియస్ మూవీ త్వరలో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ‘కంగువ’ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. కంగువ సినిమాలో హాట్ బ్యూటి దిశా పటానీ, యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ముంబైలో ‘కంగువ’ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

Suriya's Net Worth: From Charging 20-25 Crores Per Film To Owning A Fleet  Of Luxury Cars, Here's How Soorarai Pottru Actor Lives His Dream Life!

 

- Advertisement -

ఈ కార్యక్రమంలో హీరో సూర్యతో పాటు మూవీ టీమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో సూర్య తన అనుభవాలను పంచుకున్నారు. “గొప్ప సినిమాల్లో నటించే అవకాశం అదృష్టవశాత్తూ దక్కుతుంటుంది. మన కోరికను ఈ యూనివర్స్ విని అది జరిగేలా చేస్తుందని నమ్ముతాను. అది కంగువ విషయంలోనూ జరిగింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుంచి రోజు రోజుకూ మూవీ మరింత బిగ్ ప్రాజెక్ట్‌గా మారుతూ వచ్చింది. అందుకు మా డైరెక్టర్ శివకు థ్యాంక్స్ చెప్పాలి.

Biography of Actor Surya: A Journey Beyond the Silver Screen | by Zara |  Medium

 

కంగువ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేయాలని కలగన్న మా ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు. అలాగే సినిమాటోగ్రాఫర్ వెట్రి, మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లేకుండా ఈ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. ప్రతి సినిమాకు స్క్రిప్ట్‌కు మేకింగ్‌కు మధ్య కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. కానీ కంగువ సినిమాకు ప్రతి రోజూ బెటర్‌గా వర్క్ చేస్తూ వచ్చాం. ఒక కొత్త పాత్రలోకి మారిపోవడం ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. నటుడిగా పాతికేళ్ల అనుభవం తర్వాత ఒక సినిమాకు ఎగ్జైట్ అయి వర్క్ చేయడం అంత సులువు కాదు. కంగువకు 150 రోజులకు పైగా చేసిన షూట్‌లో ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ ఎక్సీపిరియన్స్ చేశాం. ఈ సినిమాకు మాకెంతో స్పెషల్. మీ అందరికీ కంగువ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని సూర్య చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here