Alia Bhatt : ఇండియా లోనే మోస్ట్ లవ్లీ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో రణబీర్ కపూర్, అలియా భట్ జంట కచ్చితంగా ఉంటుంది. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న ఈ జంటకి అప్పుడే ఒక పాప కూడా పుట్టేసింది. ఎంతో క్యూట్ గా కనిపించే ఈ జంట ని చూసి కుళ్లుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సుమారు ఐదేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఇది కాసేపు పక్కన పెడితే రణబీర్ కంటే ముందుగా అలియా భట్ సిద్దార్థ్ మల్హోత్రా తో అప్పట్లో ప్రేమాయణం నడిపింది. సిద్దార్థ్ ఇప్పుడు ప్రముఖ క్రేజీ హీరోయిన్ కియారా అద్వానీ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ సిద్దార్థ్ మొట్టమొదటి ప్రేయసి మాత్రం అలియా భట్ అట. చాలా కాలం వరకు ప్రేమించుకున్న ఈ ఇద్దరు కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిందట.
అయితే లేటెస్ట్ గా వీళ్లిద్దరు ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో కలుసుకున్నారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న ప్రాణ స్నేహితులు లాగ వీళ్లిద్దరు హాగ్ చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్, పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయా అలా హాగ్ చేసుకున్నారు. పక్కనే మీ జీవిత భాగస్వాములు ఉన్నారు కాస్త చూసుకోండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాదికి సంబంధించిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ ని ఇటీవలే నిర్వహించారు. రణబీర్ కపూర్ కి ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం కాగా, అలియా భట్ కి ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది. ఇది ఇలా ఉండగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రణబీర్ కపూర్ ‘ఎనిమల్’ బ్యూటీ త్రిప్తి దిమిరి తో కలిసి వేసిన హాట్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిల్చింది.