Teja Sajja : రవితేజ వల్ల హీరోయిన్స్ నన్ను టార్చర్ చేసారు అంటూ తేజ సజ్జ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Teja Sajja : ‘హనుమాన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టి తేజ సజ్జ ప్రస్తుతం మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సినిమాకి ముందు ఆయన చాలా సినిమాల్లో హీరోగా నటించాడు కానీ, వాటిల్లో ‘జాంబీ రెడ్డి’ చిత్రం ఒక్కటే కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. బాలనటుడిగా కెరీర్ ని ప్రారంభించిన తేజ సజ్జ, ఇప్పుడు ఏ హీరోకి సాధ్యం కానీ రికార్డ్స్ ని నెలకొల్పి చరిత్ర సృష్టించాడు.

Teja Sajja
Teja Sajja

సుమారుగా 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ‘హనుమాన్’ చిత్రం భవిష్యత్తులో 170 కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ పండితులు. మన టాలీవుడ్ లో ప్రభాస్ కి తప్ప మరో హీరో కి ఈ రేంజ్ వసూళ్లు లేవు. #RRR తో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా ఈ మార్కుని అందుకున్నారు కానీ, దాని క్రెడిట్ లో సగభాగానికి పైగా రాజమౌళి కి వెళ్ళిపోయింది.

Teja Sajja Updates

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా తేజా సజ్జ రవితేజ గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఈగల్’ ఫిబ్రవరి 9 వ తారీఖున విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా తేజ సజ్జ రవితేజ ని ఒక ఇంటర్వ్యూ చేసాడు. ఈ ఇంటర్వ్యూ లో తేజ సజ్జ రవితేజ తో మాట్లాడుతూ ‘మీ వల్ల హీరోయిన్స్ మాకు చుక్కలు చూపించేస్తున్నారు’ అని అంటాడు.

- Advertisement -
Ravi Teja Teja Sajja

ఎందుకు అని రవితేజ అడిగితే ‘ ఏ హీరోయిన్ కి ఫోన్ చేసి డేట్స్ అడిగినా, ప్రస్తుతం రవితేజ తో సినిమా చేస్తున్నాం, షూటింగ్ అయిపోగానే మీకు డేట్స్ ఇస్తాం అంటున్నారు. ఎందుకంటే మీ ఒక్క సినిమా కోసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ని లాక్ చేసేస్తున్నారు’ అని అంటాడు తేజ సజ్జ. ఈమధ్య విడుదల అవుతున్న ప్రతీ రవితేజ సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ కచ్చితంగా ఉంటున్నారు. ‘ఈగల్’ చిత్రం లో కూడా కావ్య థాపర్ తో పాటుగా,అనుపమ పరమేశ్వరన్ కూడా మరో హీరోయిన్ గా నటిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here