Shoba Shetty : బిగ్ బాస్ దత్త పుత్రిక గా శోభా శెట్టి.. మరీ ఇంత అన్యాయమా!

- Advertisement -

Shoba Shetty : ఈ సీజన్ బిగ్ బాస్ రియాలిటీ షో అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఉల్టా పల్టా అనే క్యాప్షన్ తో ప్రారంభమైన ఈ సీజన్, క్యాప్షన్ తగ్గట్టుగా న్యాయం చేస్తూ ముందుకెళ్తుంది. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ టీం కొంతమంది కంటెస్టెంట్స్ ని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చెయ్యడం, కొంతమందిని సేవ్ చెయ్యడానికి ప్రత్యేకమైన టాస్కులు నిర్వహించడం వంటివి జరుగుతున్నాయి అని సోషల్ మీడియా లో చాలా కాలం నుండి ప్రచారం లో ఉన్న వార్త.

Nagarjuna

సందీప్ ఎలిమినేషన్ వరకు న్యాయంగానే ఎలిమినేషన్స్ జరిగాయి కానీ, ఆ తర్వాత మాత్రం బిగ్ బాస్ ఆడియన్స్ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలిమినేషన్స్ చేసాడని టాక్ నడుస్తుంది. ఇదంతా పక్కన పెడితే శోభా శెట్టి ని బిగ్ బాస్ ఉద్దేశపూర్వకంగానే సేవ్ చేస్తూ వస్తున్నారని అపోహ నెటిజెన్స్ లో ఉంది.

Shoba Shetty
Shoba Shetty

ఎందుకంటే సోషల్ మీడియా లో జరిగే అన్నీ పొలింగ్స్ లోను శోభా శెట్టి కి మిగిలిన అందరి కంటెస్టెంట్స్ కంటే తక్కువ ఓట్లు నమోదు అవుతున్నాయి. అయినా కూడా ఆమె ఎలా సేవ్ అవుతుందో అర్థం కావడం లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ వారం ఏవిక్షన్ పాస్ ని యావర్ తిరిగి ఇవ్వడం తో ఎలిమినేషన్ ని ఈ వారం రద్దు చేస్తున్నట్టుగా నాగార్జున తెలిపాడు.

- Advertisement -
Shoba Shetty Yawar

వాస్తవానికి ఏవిక్షన్ పాస్ తిరిగే ఇస్తాను అన్నప్పుడు నాగార్జున అందుకు ఒప్పుకోకుండా మళ్లీ యావర్ కి తిరిగి ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు, ఈ వారం కూడా ఏవిక్షన్ పాస్ కి సంబంధించి టాస్కులను నిర్వహించబోతున్నారని నాగార్జున తెలిపాడు. అంటే ఈ వారం స్టార్ మా బ్యాచ్ లో ఎవరో ఒక కంటెస్టెంట్ ఏవిక్షన్ పాస్ ని గెలిచి, మళ్లీ శోభా శెట్టి ని సేవ్ చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. అందుకే నెటిజెన్స్ ఆమెకి బిగ్ బాస్ దత్తపుత్రిక అని నామకరణం చేసారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here