Akkineni Nagarjuna : ‘అది ఓ పరమ చెత్త షో.. దాని గురించి అడగకండి’.. బిగ్ బాస్ పై నాగార్జున షాకింగ్ కామెంట్స్

- Advertisement -


Akkineni Nagarjuna : కారణం ఏంటో తెలియదు కానీ నాగార్జున ఈ మధ్య సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ కి గురవుతున్నారు. ఇప్పటికే ఆయన తన కొడుకుల విషయంలో ఆయన సోషల్ మీడియాలో నిరంతరం ట్రోలింగ్ కు గురవుతుంటే.. తాజాగా ఆయన చేసిన ఓ తప్పుడు పనికి నెటిజన్లు నాగార్జునను ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. బుల్లి తెర పై అతి పెద్ద షో బిగ్ బాస్ అన్న సంగతి తెలిసిందే. దానికి ఆయన ఐదు సీజన్ల నుంచి హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన జడ్జిమెంట్ కు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడుతున్నాయి.

Akkineni Nagarjuna
Akkineni Nagarjuna

ఇంతవరకు బాగానే ఉంది. కానీ హోస్టుగా వ్యవహరించే నాగార్జునే బిగ్ బాస్ పరమ చెత్త షో అని కామెంట్ చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారిది. ఇటీవల సోషల్ మీడియాలో నాగార్జున ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకప్పుడు నాగార్జున దేవదాస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడినప్పటి వీడియో అది.

Nagarjuna

ఆ వీడియోలో నాగార్జున ను యాంకర్ ‘బిగ్ బాస్ షో చూస్తారా ..? అని ప్రశ్నించగా.. నాగార్జున దాని గురించి మాట్లాడకండి.. అది నేను మాట్లాడితే బ్యాడ్ గా వస్తుంది .. అసలు అది షో నేనా..? పరమ చెత్త.. పక్కన వాళ్ళ గురించి మనం తెలుసుకోవడం ఏంటి..? అంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..?’ అంటూ నెగిటివ్ గా కామెంట్ చేశారు. అయితే బిగ్ బాస్ అంటే ఇష్టం లేని నాగార్జున హోస్ట్ గా ఎందుకు ఒప్పుకున్నాడు..? అంటూ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. డబ్బు కోసం ఏమైనా చేస్తావా ..? అంటూ నాగార్జునను నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here