Akkineni Nagarjuna : సౌత్ ఇండియా లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున మరియు అమల జంట కచ్చితంగా ఉంటుంది. సినిమాల్లో హీరో హీరోయిన్లు గా నటించిన ఈ ఇద్దరు, నిజ జీవితం లో కూడా ఒక్కటి అయ్యారు. ఇన్నేళ్ల వీళ్ళ దాంపత్య జీవితం లో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఎంతో అన్యోయంగా జీవిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అయితే నాగార్జున రీసెంట్ గా అమల గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇటీవలే సంక్రాంతి కానుకగా ఆయన ‘నా సామి రంగ’ అనే చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ సినిమా కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ లో అమల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నాగార్జున కొన్ని కీలకమైన కామెంట్స్ చేసాడు, అవేంటో ఒకసారి చూద్దాం.

యాంకర్ నాగార్జున ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు అమల గారు ఇష్టమైన వంట చేసి పెడుతుందా’ అని అడగగా, దానికి నాగార్జున సమాధానం చెప్తూ ‘ప్రతీ రోజు వంట అయితే చేస్తుంది కానీ, నాకు ఇష్టమొచ్చిన వంట మాత్రం చేసి పెట్టదు. రోజు నాకు చికెన్ తినడం అలవాటు. రోజంతా పని చేసి వచ్చి, ఇష్టమైన ఆహరం తినాలంటే అది ఇంట్లో ఉండదు. ఎందుకంటే అమల నాన్ వెజ్ ముట్టదు. ఆమె ఇష్టంగా పెంచుకునే కుక్కలకు కూడా మాంసాహారం పెట్టదు. అన్నీ సందర్భాలలో అర్థం చేసుకుంటాను కానీ, ఒక్కోసారి మాత్రం ఇష్టమైన వంట చేయనందుకు కోపం వస్తుంది. ఆరోజు టార్చర్ లాగ అనిపిస్తాది’ అంటూ చెప్పుకొచ్చాడు.

షాపింగ్ వంటివి చెయ్యడం మీకు ఇష్టమేనా అని నాగార్జున ని యాంకర్ మరో ప్రశ్న అడగగా, దానికి నాగార్జున సమాధానం చెప్తూ ‘షాపింగ్ చెయ్యడం ఇష్టమే, కానీ ఇక్కడ మాత్రం షాపింగ్ చెయ్యం. విదేశాల్లోనే చేస్తాము..అమల కి బంగారం ఐటమ్స్ అంటే అసలు ఇష్టం ఉండదు. తన దగ్గర ఒకవేళ బంగారం ఉన్నా ఉంచుకోదు, ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు నాగార్జున.