Akkineni Akhil : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏజెంట్’ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదలైంది.అక్కినేని అభిమానులు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం సమయం నుండే భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈసారి అఖిల్ బాబు హిట్ కొడితే కుంభస్థలం బద్దలు అయిపోతుంది, నేరుగా స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెడతాడు అని ఆశపడ్డారు.

భారీ బడ్జెట్ స్పై యాక్షన్ జానర్ లో తెరకెక్కిన సినిమా కావడం, సురేందర్ రెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ ఈ చిత్రానికి పని చెయ్యడం వల్ల ఈ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, ట్రైలర్ పర్వాలేదు అని అనిపించింది.అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఈ మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అక్కినేని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది ఈ చిత్రం.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కి సంబంధించిన మొదటి ఆట ని హైదరాబాద్ లో అక్కినేని అఖిల్ మూవీ టీం తో కలిసి శ్రీ రాములు థియేటర్ లో చూసాడు. సినిమా ప్రారంభం కి ముందు అభిమానులు ఎంతో ఉత్సాహం గా ఉన్నారు, అఖిల్ థియేటర్ లోకి అడుగుపెట్టగానే అరుపులు కేకలు మరియు విజిల్స్ తో థియేటర్ మోతమోగిపోయింది. అలా అభిమానుల కోలాహలం మధ్య ప్రారంభమైన ఈ షో, ఫస్ట్ హాఫ్ పూర్తి అవ్వగానే తీవ్రమైన నిరాశకి గురయ్యారు.

అభిమానుల్లో సొమ్మసిల్లిన ఎనర్జీ ని చూసి అఖిల్ సెకండ్ హాఫ్ ప్రారంభం కి ముందే థియేటర్ నుండి లేచి బయటకి వెళ్ళిపోయాడు. ఇది అందరినీ షాక్ కి గురి చేసిన విషయం. అయితే ఏజెంట్ చిత్రం పై అభిమానుల్లో మొదటి నుండి అంచనాలు ఉండడం వల్ల ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్ లో వచ్చాయి. కానీ ఫుల్ రన్ లో నిలబడడం అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్.
