Akkineni akhil : తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని వారసురులుగా నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. నాగచైతన్య సినిమాలపరంగా పరవాలేదు అనిపించుకున్నా.. అఖిల్ మాత్రం ఇప్పటివరకు హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అఖిల్ నటించిన చిత్రాలలో అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప మిగతావన్నీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.. అయినప్పటికీ కేవలం నాలుగు సినిమాల తర్వాత ఒకేసారి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఏజెంట్ సినిమాలో నటించారు అఖిల్.

ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 28న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న అఖిల్ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేయడం జరిగింది.. అక్కినేని వారసత్వం పై మాట్లాడుతూ ఈ ఊబిలో పడడం తనకు ఇష్టం లేదని.. ఇందులో పడితే మూస ధోరణిలో సినిమాలు చేయవలసి వస్తుందని, అలా చేయడం తనకి అసలు ఇష్టం లేదని తానే స్వతగా ఎదగాలనుకుంటున్నట్లు తెలియజేశారు అఖిల్.

అయితే అక్కినేని వారసుడుగా పని చేయను..అక్కినేని అఖిల్ గా మాత్రమే పనిచేస్తానని తెలియజేశారు.. అక్కినేని వారసుడుగా పనిచేస్తే ప్రతిసారి కూడా ఒకేలాగా చేయవలసి ఉంటుంది.. ఒక నటుడుగా నేను ఎదిగేందుకు ఎంత ప్రయత్నించినా కూడా అది విఫలం అవుతూనే ఉంది.. అందుకే తెలుగు ప్రేక్షకులు తనను తానుగా ఒప్పుకోవాలని తనకు సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు అఖిల్.. అందుకోసం పోరాటం చేస్తూనే ఉంటానని తన కెరీర్ మొత్తం దానికి ప్రయత్నిస్తూ ఉంటానని అఖిల్ తెలియజేశారు.ముఖ్యంగా అక్కినేని వారసత్వం అనే లెగసి తన భుజాల పైన ఉంటే ఎక్కువగా ఆలోచించి ఆ ట్రాక్ లోకి వెళ్ళిపోతాను నేను తెలుగు ఆడియో సాంగీకారాన్ని పొందడం తన డ్రీమ్ అని తెలియజేశారు అఖిల్. దీంతో పరోక్షంగా అఖిల్ అక్కినేని వారసత్వాన్ని దూరం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.