పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ #OG చిత్రం పై ఇండస్ట్రీ లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు.ఈ చిత్రం నుండి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సోషల్ మీడియా లో వైరల్ అయిపోతుంది. గత నెల 15 వ తారీఖు నుండి ముంబై లో ప్రారంభమైన మొదటి షెడ్యూల్ ఈమధ్యనే ముగిసింది. పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించారు.

ఆయనతో పాటుగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరియు హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం పూణే లో మరో కొత్త షెడ్యూల్ ప్రారంభం అయ్యింది, మే 8 వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.ఇందులో పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక మోహన్ మధ్య ఒక పాట , మరియు సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇక నేడు డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ వర్కింగ్ స్టిల్ ఒకటి విడుదల చేసారు, దీనికి సోషల్ మీడియా లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. గ్రౌండ్ లెవెల్ అప్పుడే ఈ ఫోటో తో బైక్ స్టిక్కర్స్ మరియు బ్యానర్స్ వచ్చేసాయి, ఇలా ఈ సినిమాపై ఏర్పడిన క్రేజ్ చూసి ట్రేడ్ సైతం ఆశ్చర్యపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రం మూడు డిఫరెంట్ టైమ్స్ లో, మూడు స్టేజిలలో సాగనుంది. అందులో పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ రోల్ కూడా ఒకటి ఉంది. గ్యాంగ్ స్టర్ గా మారే ముందు 17 ఏళ్ళ వయస్సు లో ఉండే ఈ పాత్ర కోసం అకిరా నందన్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుజిత్. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ సినిమాకి ఏర్పడే హైప్ ముందు ఏ పాన్ వరల్డ్ సినిమా కూడా నిలబడదు అని చెప్పొచ్చు. ఇది జరగాలని అభిమానులు చాలా బలంగా కోరుకుంటున్నారు.
