Akhil Akkineni : రాజమౌళి చేతుల్లోకి అఖిల్ కొత్త సినిమా.. మహేష్ తో ఇక లేనట్టేనా..?

- Advertisement -

Akhil Akkineni : అక్కినేని కుటుంబం రెండు తరాలు ఇండస్ట్రీ ని ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని శాసించాయో మన అందరం చూసాము. అక్కినేని నాగేశ్వర రావు ఇండస్ట్రీ కి రెండు కళ్ళలో ఒకటిగా నిలిస్తే, ఆయన తనయుడు నాగార్జున టాప్ 3 స్టార్ హీరోస్ లో ఒకడిగా దశాబ్దాలు కొనసాగి, మన తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. కానీ ఆయన కుమారులు మాత్రం ఇందుకు విరుద్ధం, నాగ చైతన్య పర్వాలేదు అనే రేంజ్ క్లిక్ అయ్యాడు కానీ , ఇంకా మీడియం రేంజ్ హీరోగ్గానే మిగిలిపోయాడు.

Akhil Akkineni
Akhil Akkineni

ఇక రెండవ కొడుకు అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముంది, అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు దాటినా ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఏజెంట్’ చిత్రం కూడా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

దీంతో అఖిల్ తదుపరి మూవీ కచ్చితంగా ఇండస్ట్రీ ని షేక్ చేసే విధంగా ఉండాలని నేరుగా నాగార్జున రంగం లోకి దిగాడు. అసలు విషయానికి వస్తే అఖిల్ తన తదుపరి చిత్రం అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడితో ఉండబోతుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాకి ధీర అనే పేరు పెట్టారు. అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ మొత్తం దర్శక ధీరుడు రాజమౌళి మరియు ఆయన కొడుకు కార్తికేయ పర్యవేక్షణలో జరగబోతున్నట్టు సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం వీళ్లిద్దరు అదే పనిలో ఉన్నారట. నాగార్జున స్వయంగా రాజమౌళి ని రిక్వెస్ట్ చెయ్యడం తో వాళ్ళు అఖిల్ కోసం పని చెయ్యడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు అఖిల్ కోసం పని చేస్తే మరి మహేష్ బాబు తో చెయ్యబోయే సినిమా పరిస్థితి ఏమిటి అంటూ మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి ని ట్యాగ్ చేసి అడుగుతున్నారు. మహేష్ బాబు తో తదుపరి సినిమా అన్నప్పుడు, అతని సినిమా గురించే పని చెయ్యాలి కానీ మధ్యలో ఇవన్నీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here