Agent 1st Day Collections : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఏజెంట్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు మరియు మలయాళం బాషలలో ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ వచ్చింది, డైరెక్టర్ సురేందర్ రెడ్డి నుండి ఇలాంటి సినిమా చూస్తామని అనుకోలేదని, ఒక్కటంటే ఒక్క సన్నివేశం కోసం ఆకట్టుకునేలా లేదని, అక్కినేని ఫ్యాన్స్ ఆరోపించారు.
అఖిల్ కెరీర్ ని మలుపు తిప్పే సినిమాగా ‘ఏజెంట్’ చిత్రం నిలుస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్మారు, కానీ చివరికి ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యే దిశగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 37 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్స్ చూస్తూ ఉంటె ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల వసూళ్లను కూడా రాబట్టేలా లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.వాళ్ళ లెక్కల ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాము.
ఈ చిత్రానికి విడుదలకు ముందు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో కాలేదు, కానీ టాక్ వస్తే అద్భుతమైన ఓపెనింగ్ కచ్చితంగా వస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేసాయి, కానీ టాక్ రాకపోవడం తో మ్యాట్నీ షోస్ నుండి వసూళ్లు ఊహించని రేంజ్ లో డ్రాప్ అయ్యాయి. ఇక ఫస్ట్ షోస్ అయితే ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల క్రితం విడుదలైన విరూపాక్ష చిత్రానికి ‘ఏజెంట్‘ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా, వారం క్రితం విడుదలైన సినిమాతో సమానం అయ్యిందంటే ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొదటి రోజు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. టాక్ లేనందున ఇక ఈ చిత్రం వీకెండ్ వరకు ఆడడం కూడా కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.