తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కొందరితో పడుకోవాలి అని.. అలాగే మొత్తం విప్పి చూపించాలి అని కొన్ని వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.. కొందరు హీరోయిన్లు అయితే అవకాశాల పేరుతో నలిపేస్తారు అన్న నిజాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్తున్నారు.. తాజాగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తెలుగు ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఆమె మాటలతో ఇండస్ట్రీ లో జరుగుతున్న చీకటి బాగోతాలు బయటపడ్డాయని తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను తెగ ఊపేస్తుంది..

టాలివుడ్ లో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరు అని. కేవలం ముంబై నుంచి వచ్చిన అమ్మాయిలకు మాత్రమే ఇక్కడ ఛాన్సులు ఇస్తారు తప్ప తెలుగు అమ్మాయిలను మాత్రం పట్టించుకోరనే వాదన ఉంది.. దీనిపై గతంలో చాలామంది తెలుగు అమ్మాయిలు నోరు విప్పారు. కాగా, తాజాగా హీరోయిన్ ఐశ్వర్య కూడా ఘాటుగానే స్పందించింది. ఆమె నటించిన ఫర్హానా మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఇక మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె మాట్లాడుతూ… నేను తెలుగు అమ్మాయినే. అయినా కూడా నాకు తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగులో నటించాలంటే తెల్లగా, సన్నగా ఉండి, గ్లామర్ షోలు చేయాలి.. మనకు సెట్ కాదులే అని ఇక్కడ అవకాశాలు వెతకడం ఆపేశాను అంటూ చెప్పుకొచ్చింది..

ఇక అప్పుడే నాకు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అందులో పాత్ర కూడా నాలాగా డీ గ్లామర్ రోల్. సినిమా రిలీజ్ అయ్యాక అందరికీ నా పాత్ర బాగా కనెక్ట్ అయింది. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర కూడా నా లాగే డీ గ్లామర్ పాత్ర. ఆ పాత్ర ఆమె కంటే నాకే బాగా సూట్ అవుతుంది. కానీ నాకు ఛాన్స్ రాలేదు. తెలుగులో నేను ఆశించినంత పెద్ద హీరోలు, పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశాలు అయితే రాలేదు. నా స్ట్రెండ్ తమిళ సినిమాలే. అక్కడే నాకు అవకాశాలు వస్తున్నాయి అంటూ తెలిపింది ఐశ్వర్య.. తెలుగు హీరోలు కూడా అలాంటి వారినే కోరుకుంటున్నారు.. అందుకే కొందరు హీరోయిన్లు ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నారని నమ్మలేని నిజాలను బయట పెట్టింది.. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..