45 సెకండ్ల వీడియో తో 100 కోట్లు..’ఉస్తాద్ భగత్ సింగ్’ రికార్డుల ఊచకోత మొదలు

- Advertisement -

అభిమానులతో పాటుగా, ప్రేక్షకులందరూ ఇష్టపడే కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటి పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ అనే చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.అప్పటి వరకు సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ మరియు ఆయన ఫ్యాన్స్ కి ఈ చిత్రం ఇచ్చిన కిక్ మామూలుది కాదు.

ఉస్తాద్ భగత్ సింగ్
ఉస్తాద్ భగత్ సింగ్

ఆరోజుల్లోనే ఈ సినిమా 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది అంటే మామూలు విషయం. అప్పట్లో ఒక్క మగధీర చిత్రం తప్ప, మిగిలిన ఏ సినిమా కూడా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టలేదు.అలాంటి కాంబినేషన్ నుండి వస్తున్నా రెండవ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ చిత్రం ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకోగా,దానికి సంబంధించిన చిన్న గ్లిమ్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేసారు.

Pawan Kalyan

ఈ గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో 20 మిలియన్ కి పైగా వ్యూస్ తో టాప్ లో ట్రెండింగ్ అవుతుంది.మొదటి షెడ్యూల్ కేవలం 8 రోజులు మాత్రమే జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ నాలుగు రోజులు మాత్రమే పాల్గొన్నారు.ఈ నాలుగు రోజుల్లోనే ఆయన నుండి ఫ్యాన్స్ కి నచ్చే ఇన్ని కోణాలను బయటకి తీశారంటే, ఇక అర్థం చేసుకోవచ్చు హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని ఏ రేంజ్ లో తియ్యబోతున్నాడో.

- Advertisement -
Ustaad bhagat singh

అయితే ఈ గ్లిమ్స్ వీడియో చూడగానే ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రారంభం అయ్యిపోయిందట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నుండే వంద కోట్ల రూపాయిల రేంజ్ బిజినెస్ జరుగుతుందట.అయితే మైత్రీ మూవీ మేకర్స్ అప్పుడే డీల్ ని క్లోజ్ చెయ్యడం ఇష్టం లేక , ఇంకా మంచి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఇంకెన్ని అద్భుతాలు సృష్టించబోతుందో అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here