Aishwarya Rajesh : అమ్మబాబోయ్.. ఐశ్వర్య రాజేశ్ ఏంటి ఇంత బోల్డ్ గా చేసింది?

- Advertisement -

Aishwarya Rajesh.. ఈ పేరు వినగానే తమిళ్ హీరోయిన్ అనిపించినా.. తెలుగమ్మాయి అనే ఫీలింగే వస్తుంది. రావడమే కాదు ఈమె మూలాలు తెలుగులోనే ఉన్నాయి. తెలుగు సీనియర్ నటి శ్రీలక్ష్మికి బంధువు. తెలుగమ్మాయే అయినా ఈ భామ తమిళ్ లోనే ఎక్కువగా సినిమాలు చేస్తుంది. అయిేతే ఐశ్వర్య ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నింటిలో చాలా సంప్రదాయంగా.. గ్లామర్ పేరుతో హద్దులు మీరకుండా జాగ్రత్త పడింది. సోషల్ మీడియాలోనూ.. ఫిల్మ్ ప్రమోషన్స్ లోనూ ఈ భామ ట్రెండీగా కనిపించిన సందర్భాలున్నాయి కానీ బోల్డ్ గా కనిపించిందే లేదు.

Aishwarya Rajesh
Aishwarya Rajesh

 

కానీ అభిమానులకు షాక్ ఇస్తూ ఐశ్వర్య రాజేశ్ తాజాగా ఓ హాట్ ఫొటోషూట్ చేసింది. బ్లాక్ కలర్ నైట్ డ్రెస్సులో హాట్ పోజులతో రచ్చ చేసింది. కవ్వించే చూపులతో.. మత్తెక్కించే పోజులతో మాయ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంత బోల్డ్ అవతార్ లో ఐశ్వర్యను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది తమకు తెలిసిన ఐశ్వర్య రాజేశేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

Album - ஐஸ்வர்யா ராஜேஷ் லேட்டஸ்ட் ஆல்பம் | Actress Aishwarya Rajesh Latest  Album

 

ఇక ఐశ్వర్య రాజేశ్ సినిమాల సంగతికి వస్తే ఈ భామ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఈమె క్రికెటర్ గా నటించి తన నటనతో మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో మరిన్ని చిత్రాలు చేసినా అంత గుర్తింపు రాలేదు. కానీ ఐశ్వర్య రాజేశ్ సినిమా అంటే పర్ఫామెన్స్ అదిరిపోతుందనే భావన మాత్రం ప్రేక్షకుల్లో వచ్చింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు లేక కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఐశ్వర్య తను చేసే ప్రతి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here