#NTRNEEL: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ ప్రారంభం..విడుదల తేదీ కూడా ఫిక్స్..ప్లానింగ్ మాములుగా లేదుగా!

- Advertisement -

NTRNeel: 2018 వ సంవత్సరం లో విడుదలైన అరవింద సమేత చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా విడుదలై చాలా కాలం అయ్యింది. మధ్యలో #RRR వచ్చినప్పటికీ కూడా అది మల్టీ స్టార్రర్ అవ్వడంతో అభిమానులకు ఇప్పుడు అర్జెంటు గా ఎన్టీఆర్ నుండి ఒక సోలో హీరో మూవీ కావాలి. #RRR తర్వాత ఆయన కొరటాల శివతో దేవర అనే చిత్రం చేసాడు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెల 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి వచ్చిన టీజర్, రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్, స్టైలింగ్ కూడా అదిరిపోయింది.

NTR 31 BREAKING: Jr NTR and Prashanth Neel's film gets a release date, two years after initial announcement | PINKVILLA

ఇకపోతే ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి ఏ సినిమా వస్తుంది అని అభిమానులు ఎదురు చూస్తుండగా, ప్రశాంత్ నీల్ తో త్వరలోనే సినిమా ప్రారంభం అవ్వబోతుంది అని సోషల్ మీడియా లో టాక్ వినిపించేది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నేడు గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ తో పాటు, ఎన్టీఆర్ కుటుంబం, ప్రశాంత్ నీల్ కుటుంబం ఈ ఈవెంట్ కి పాల్గొన్నారు. దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటుగా నందమూరి ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. రెండేళ్ల క్రితమే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ ని విడుదల చేసారు.

- Advertisement -

Image

అయితే ఈ సినిమా ప్రారంభానికి ముందు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ చేయబోతున్నాడని, ఎన్టీఆర్ తో సినిమా ఇప్పట్లో ఉండే అవకాశమే లేదని రూమర్స్ వినిపించాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని డైరెక్టర్ కొట్టిపారేశారు. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం జనవరి 9 ,2026 వ సంవత్సరం లో విడుదల కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో 15 నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ నుండి మూడు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి అన్నమాట. దేవర చిత్రం సెప్టెంబర్ 27 న విడుదల అవుతుండగా, వార్ 2 చిత్రం ఆగస్టు 15 న, అలాగే ప్రశాంత్ నీల్ తో సినిమా జనవరి 9 2026 న విడుదల అవ్వబోతున్నాయి. ఒకప్పుడు ఎన్టీఆర్ ఎంత వేగంగా సినిమాలు చేసేవాడో అంతే వేగంగా ఇప్పుడు కూడా చేస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.

Image

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here