NBK-Boyapati టాలీవుడ్ లో దిగ్గజ నిర్మాతగా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తీసిన అల్లు అరవింద్, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆహా ఓటీటీ యాప్ ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.ప్రారంభం నుండే ఆసక్తికరమైన ప్రోగ్రామ్స్ మరియు కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఆహా,నందమూరి బాలకృష్ణ ని వ్యాఖ్యాతగా పరిచయం చేస్తూ చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో గ్రాండ్ హిట్ అవ్వడం తో ఆహా యాప్ ఇండియాలోనే టాప్ 5 ఓటీటీ యాప్స్ లో ఒకటిగా నిలిచింది.

ఈ టాక్ షో లో బాలయ్య బాబు మన టాలీవుడ్ టాప్ స్టార్ హీరోలతో చేసిన సందడి హైలైట్ గా మారింది.రెండు సీజన్స్ ని పూర్తి చేసుకున్న ఈ టాక్ షో మూడవ సీజన్ ని కూడా జరుపుకుంటుందో లేదో తెలియదు కానీ, అతి త్వరలోనే బాలయ్య బాబు తో ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేసే ఆలోచనలో ఉందట ఆహా మీడియా.

అల్లు అరవింద్ ఇటీవలే బాలయ్య బాబు ని కలిసి ఈ ఐడియా చెప్పడం తో ఆయన కూడా ఐడియా అద్భుతంగా ఉంది, కథ సిద్ధం చేయించండి కచ్చితంగా చేద్దాము అన్నాడట. దీనితో అల్లు అరవింద్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ని కలిసి కథని సిద్ధం చేయాల్సిందిగా చెప్పాడట. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ , అఖండ చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని ఊపేసాయి.ఇప్పుడు ఈ కాంబినేషన్ డిజిటల్ మీడియా లో కూడా అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న బోయపాటి శ్రీను, ఈ చిత్రం పూర్తవ్వగానే ఈ వెబ్ సిరీస్ పై ద్రుష్టి సారించబోతున్నాడట బోయపాటి శ్రీను. వెండితెర మీద అద్భుతాలు సృష్టించిన ఈ క్రేజీ కాంబినేషన్, డిజిటల్ ప్రపంచాన్ని ఎలా ఏలబోతుందో చూడాలి. ఆహాలో బాలకృష్ణ అన్‌స్టాపబుల్ 2 షో సూపర్ సక్సస్ అయ్యింది. సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్‌కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో ఆహా రేటింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఇప్పటికే వెంకటేష్ రానా ఇద్దరూ కలిసి “రానా నాయుడు” పేరుతో వెబ్‌సిరీస్ చేస్తున్నారు. “రానా నాయుడు వెబ్ సిరీస్” మార్చ్ 10న నెట్ ఫ్లిక్స్‌లో రానుంది.
