ఆదిపురుష్.. ఆ సీన్స్ హైలెట్.. విజిల్స్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి

- Advertisement -

ఈ ఏడాది ఇండియ‌న్ సినిమా ల‌వ‌ర్స్ అత్యంత ఆస‌క్తిగా ఎదురుచూసిన సినిమాల్లో ఆదిపురుష్ ఒక‌టి. రామాయ‌ణ‌గాథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్ర‌భాస్ హీరోగా న‌టించాడు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ద‌ర్శ‌కుడు ఓంరౌత్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్‌లో జాన‌కి పాత్ర‌లో కృతిస‌న‌న్ న‌టించింది. ప్రీ రిలీజ్ బిజినెస్‌, అడ్వాన్స్ బుకింగ్స్‌తో రిలీజ్‌కు ముందే ఆదిపురుష్ అన్నీ ఇండ‌స్ట్రీల‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. భారీ అంచ‌నాలు న‌డుమ ఆదిపురుష్ మూవీ శుక్ర‌వారం (నేడు) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఆదిపురుష్‌లో మెయిన్ హైలైట్ రాముడు పాత్ర‌ను పోషించిన ప్ర‌భాస్ అని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ ట్వీట్స్ చేస్తోన్నారు. రాముడిగా ప్ర‌భాస్ యాక్టింగ్ సూపర్ అంటూ పేర్కొంటున్నారు. అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీన్స్‌ను ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తార‌ని అంటున్నారు. అయితే మిగిలిన క్యారెక్ట‌ర్స్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఆదిపురుష్‌లో ప్ర‌భాస్ త‌క్కువ స్క్రీన్‌టైమ్ క‌నిపించిన ఫీలింగ్ క‌లుగుతుంద‌ని చెబుతోన్నారు. రామాయ‌ణాన్ని నేటి త‌రానికి క‌నెక్ట్ అయ్యేలా ఆదిపురుష్ ద్వారా చెప్పాల‌నే ప్ర‌య‌త్నంలో ఓంరౌత్ పూర్తిస్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయార‌నే కామెంట్స్ వినిపిస్తోన్నాయి. ఫ‌స్ట్ హాఫ్‌లోని డ్రామా ద‌ర్శ‌కుడు అద్భుతంగా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడ‌ని అంటున్నారు. అస‌లు క‌థ మొత్తం ఫ‌స్ట్ హాఫ్‌లోనే చెప్ప‌డంతో సెకండాఫ్ చెప్ప‌డానికి ఏం లేక‌పోవ‌డంత‌ సాగ‌దీశాడ‌ని కామెంట్స్ వినిపిస్తోన్నాయి.

Adipurush

సరిగ్గా 2 గంటల 59 నిమిషాల నిడివితో ఆదిపురుష్ చిత్రం మొదలవుతుంది. ముందుగా చెప్పినట్లుగా దర్శకుడు ఓం రౌత్.. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవి వనవాసం సన్నివేశంతో కథని ప్రారంభించారు. ఓం రౌత్ ఈ చిత్రాన్ని అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా తెరకెక్కించినట్లు ఆల్రెడీ చెప్పారు. ఓ యాక్షన్ సన్నివేశంతో శ్రీరాముడిగా ప్రభాస్ పరిచయ జరుగుతుంది. అంతకు ముందు రావణుడిగా సైఫ్ అలీఖాన్ భయంకరమైన ఎంట్రీ ఇస్తాడు.

- Advertisement -

కథలో శూర్పణఖ సన్నివేశాన్ని ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించారు. ఆ తర్వాత లక్ష్మణ రేఖ సన్నివేశం, మాయలేడి సన్నివేశం వరుసగా వస్తాయి. రావణుడు సీతాదేవిని అపహరించడంతో ఒక్కసారిగా కథ సీరియస్ గా మారుతుంది. హనుమంతుడి పాత్రలో దేవద్దత్త నాగే ఎంట్రీ ఎమోషనల్ గా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే సుగ్రీవుడు, వాలి ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. సుగ్రీవుడి కోట, అంధులు జంతువుల విజువల్స్ ఈ జనరేషన్ ఆడియన్స్ కి తగ్గట్లుగా ఉంటాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here