యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం రీసెంట్ గానే విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ రేంజ్ వసూళ్లను దక్కించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి ముందు నుండి భారీ హైప్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ వరకు కళ్ళు చెదిరే రేంజ్ ని రాబట్టింది కానీ, ఫుల్ రన్ లో మాత్రం నాల్గవ రోజు నుండి అతి దారుణంగా వసూళ్లు పడిపోయాయి.

రోజు రోజు కి ముందురోజు తో పోలిస్తే 50 శాతం కి పైగా వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అలా వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి ఎంత వసూళ్లను రాబట్టింది, బ్రేక్ ఈవెన్ కి ఇంకా ఎంత వసూళ్లు రాబట్టాలి?, అసలు ఈ సినిమా రేంజ్ కనీసం యావరేజి అయినా అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 74 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంని ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల నుండి 120 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో మరో ఆరు కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమాకి 40 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లబోతుంది అన్నమాట. ఇక హిందీ లో కూడా ఇదే పరిస్థితి. మొదటి మూడు రోజులకు కలిపి వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టగా, తర్వాతి నాలుగు రోజులకు కలిపి కనీసం 20 కోట్ల రూపాయిల నెట్ ని కూడా రాబట్టలేకపోయింది. అలా తెలుగు మరియు ఆదిపురుష్ హిందీ భాషలకు కలిపి కేవలం ఇండియా లో ఈ సినిమాకి 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, అలాగే ఓవర్సీస్ కూడా లెక్క వేస్తె 175 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
